
జనరల్ బిపిన్ రావత్‌ను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యవహరిస్తున్నారు. జనరల్ రావత్ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన్ను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కేంద్రం ప్రకటించింది. ఈ పదవి ఏర్పాటుకు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంగీకారంతో కేంద్రం ఈ నిర్ణయించింది.

రక్షణ శాఖ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మిలటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పర్యవేక్షిస్తారు.

రావత్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 1978 డిసెంబర్‌లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నారు బిపిన్ రావత్

1999లో కార్గిల్ యుద్ధం తర్వాత దేశ రక్షణ విధానాల్లో లోపాలను పరిశీలించేందుకు ఏర్పడ్డ అత్యున్నత స్థాయి కమిటీ సూచన మేరకు CDS పదవి తెరపైకి వచ్చింది. CDS పదవిని సృష్టించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ఏకైక సలహాదారుగా CDS వ్యవహరిస్తున్నారు.

ఆయనకు సైనిక పరమైన అధికారాలు ఉండవు. విడివిడిగా సైన్యం, నౌకాదళం, వాయుసేనలకు ఆయా దళాల అధిపతులే నాయకత్వం వహిస్తారు. కొత్తగా ఏర్పడ్డ సైబర్, అంతరిక్ష విభాగాలు CDS కనుసన్నల్లోనే పనిచేస్తుంది. NCA కు ఆయన సైనిక సలహాదారుగా ఉన్నారు. రక్షణ కొనుగోళ్ల కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

2016 డిసెంబర్ 31న సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన రావత్.. మూడేళ్ల పాటు ఆ పదవిలో పనిచేశారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం సైన్యాధిపతి ఆ పదవిలో మూడేళ్లు కానీ 62 ఏళ్లు వచ్చే వరకూ కానీ ఉండొచ్చు.

రావత్‌కు ఇంకా 62 ఏళ్లు నిండనప్పటికీ సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవ్వడంతో పదవీ విరమణ చేశారు.

సైన్యాధిపతి హోదాలో రావత్ అనేక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాన్ని తెచ్చారు. సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాలలో చదివిన రావత్ ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా సైన్యంలోకి ఎంపికయ్యారు. శిక్షణ తర్వాత 1978 డిసెంబర్‌లో గూర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లో అధికారిగా చేరారు.

భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా బిపిన్ రావత్ 2019, జనవరిలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. త్రివిధ దళాల(వాయుసే, ఆర్మీ, నౌకాదళం) తొలి అధిపతిగా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక ఆయన పదవీకాలం 2022, జనవరితో ముగియనుంది.

అంతలోనే ఈ ప్రమాద ఘటన జరగడం చాలా దురదృష్టకరమని పలువురు భావిస్తున్నారు.మూడేళ్లపాటు ఆర్మీ చీఫ్‌గా పని చేసిన బిపిన్ రావత్.. 2019, జనవరిలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు.

అంతకు ముందే ఆయన్ను దేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలకు చెందిన చిహ్నాలను ఆయన యూనిఫాం మీద పొందుపరిచారు.

మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. త్రివిధ దళాలకు సంబంధించి.. రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్‌గా సీడీఎస్ వ్యవహరిస్తున్నారు.అనేక ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.

CDS పదవి , సైన్యాధిపతి హోదాలో రావత్ అనేక సంస్కరణలు చేసిన ఘనత దేశం మొత్తం తెలిసిందే...