
క్యారట్ ప్రయోజనాలు: క్యారట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బాడీలో విటమిన్ Aగా మారి కంటి చూపును బెటర్ చేసి చర్మాన్ని కాంతివంతం మారుస్తుంది.అలాగే క్యారట్‌లో ఫైబర్, విటమిన్ K, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌తో పోలిస్తే క్యారెట్లలో సహజ చక్కెర చాతా తక్కువగా ఉంటుంది. కాబట్టి డాయాబెటీస్ ఉన్న వారికి ఇది ఉత్తమంగా పనిచేస్తుంది.

బీట్‌రూట్ ప్రయోజనాలు : బీట్‌రూట్‌లో ఫోలేట్, మాంగనీస్, సహజ నైట్రేట్లు వంటివి అధికం ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతాయి.అలాగే శరీరంలో వాపులను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు: ఇవి రెండు మన హార్ట్‌గా మేలు చేసేవి అయినప్పటికీ.. క్యారట్‌తో పోల్చుకుంటే బీట్‌రూట్ వల్ల గుండెకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్లు రక్త ప్రసరణను వేగవంతం చేసి, గుండె పనితీరును బెటర్ చేస్తాయి. క్యారెట్లలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బీట్‌రూట్‌లోని నైట్రేట్లు శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతాయి. కాబట్టి వర్కౌట్స్ చేసే వారికి ఇన్‌స్టంట్ స్టామినాకోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది.

క్యారెట్‌లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్‌లోని బీటైన్ కాలేయ పనితీరును మెరుగుపరిచి, శరీరంలోని వ్యర్థాలను క్లీన్ చేస్తుంది. అలాగే క్యారేట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు సర్మసౌందర్యాన్ని కాపాడికి ముఖానికి కాంతిని ఇస్తాయి. బీట్‌రూట్‌లోని విటమిన్ C చర్మంపై నల్లటి మచ్చలను తొలగించి.. చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. ఇవి రెండు ఆరోగ్యం పరంగా ప్రయోజనరమైనవే అయినప్పటికీ వీటినిమితంగా తీసుకోవడం చాలా మంచింది.

ఈ రెండింటిలో ఏది మంచిది అనే విషయానికి వస్తే.. ఇది మీ ప్రయారిటీస్‌పై ఆధారపడి ఉంటుంది. మీ కంటి చూపు మెరుపడాలి, మీకు తక్కువ కేలరీలు కావాలి అనుకుంటే, క్యారెట్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. అదే క్రమంలో మీకు మెరుగైన రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యం, ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలి అనుకుంటే బీట్‌రూట్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. రెండింటినీ ఆహారంలో భాగంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.