కారు బ్రేక్: అవసరం లేకపోయినా కారు బ్రేక్‌ను పదే పదే ఉపయోగించకూడదు. ఇలా చేస్తే కారు బ్రేక్ వేడెక్కుతుంది. దాని పనితీరును ప్రభావితం చేుస్తుంది. బ్రేక్‌కు బదులుగా ఇంజిన్ టెక్నాలజీని ఉపయోగించాలి.
ఉష్ణోగ్రత: పర్వాతలపై వాతావరణం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వాతావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకుంటూ టూర్ ప్లాన్ చేసుకోవాలి. లేదంటే మార్గమధ్యలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండొచ్చు, తుపాను మధ్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
స్పీడ్ కంట్రోల్: పర్వతాలపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు బ్యాలెన్స్‌ను నిర్వహించడం చాలా అవసరం. కారును నడుపుతున్నప్పుడు వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి. అతివేగంతో వెళితే.. కారు నియంత్రణ కోల్పోవచ్చు. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
దూరం పాటించాలి: పర్వాతలపై మాత్రమే కాకుండా ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందు, వెనుక వాహనాలకు దూరం పాటించాలి. అలా చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దూరం పాటించడం ద్వారా సేఫ్‌గా డ్రైవింగ్ చేయొచ్చు.
రహదారి చిహ్నాలు: చాలా మంది ప్రజలు ప్రయాణ సమయంలో రహదారిపై ఉండే సంకేతాలను గుర్తించరు. కానీ, ఇలా ఎప్పుడూ చేయొద్దు. రహదారిపై సంకేతాలను, హెచ్చరికలను ఎల్లప్పుడూ చూస్తుండాలి. ఆ చిహ్నాలు, గుర్తుల ప్రకారమే వాహనాన్ని నడపాలి.