ఓరీ దేవుడో..బిర్యానీ ఆకు నేరుగా తింటే ఇంత డేంజరా? నిపుణులు హెచ్చరిస్తున్న ఈ ఘోర ప్రమాదాల గురించి తెలిస్తే..

Updated on: Jul 20, 2026 | 6:32 PM

భారతీయ వంటకాల్లో సువాసన కోసం ఉపయోగించే బిర్యానీ ఆకులను నేరుగా తినడం లేదా మింగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది బిర్యానీ ఆకు విషపూరితమైనదని భావిస్తారు. కానీ, అది నిజం కాదు. దీని అసలు ప్రమాదం దాని భౌతిక నిర్మాణంలో ఉంది. అందుకే వంటల్లో దీనిని ఫ్లేవర్ కోసం మాత్రమే వాడుకుని, తినే ముందు పక్కన పెట్టడం సురక్షితం. ఆ కారణాలేంటో వివరాల్లోకి వెళితే..

1 / 5
భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా బిర్యానీ, పులావ్, రకరకాల కూరల్లో సువాసన కోసం బిర్యానీ ఆకును విస్తృతంగా వాడుతుంటాం. అయితే, వంట పూర్తయిన తర్వాత చాలామంది ఈ ఆకును తీసి పక్కన పడేస్తారు. దీని వెనుక కేవలం రుచి మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన ఆరోగ్య భద్రతా కారణం కూడా దాగి ఉంది. బిర్యానీ ఆకులను నేరుగా తినవచ్చా? వాటి వల్ల ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా? అనే విషయంపై పోషకాహార, వైద్య నిపుణులు వెల్లడించిన ఆసక్తికరమైన నిజాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే..

2 / 5
వంటలలో బిర్యానీ ఆకును ఉడికించడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కానీ, ఆ ఆకును నేరుగా నమిలి మింగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే.. బిర్యానీ ఆకు చాలా గట్టిగా, పీచు పదార్థంతో కూడి ఉంటుంది. మన జీర్ణవ్యవస్థలోని ఆమ్లాలు, ఎంజైములు ఈ ఆకును పూర్తిగా విచ్ఛిన్నం చేయలేవు. కాబట్టి, ఇది జీర్ణం కాకుండా అలాగే ఉండిపోతుంది.

3 / 5
ఎండిన బిర్యానీ ఆకు అంచులు చాలా పదునుగా ఉంటాయి. దీనిని మింగినప్పుడు అది గొంతులో, అన్నవాహికలో లేదా పేగుల గోడలకు గుచ్చుకునే ప్రమాదం ఉంది. తీవ్రమైన సందర్భాల్లో ఇది లోపలి అవయవాలకు గాయాలు చేయవచ్చు. అంతేకాదు..ఈ ఆకు గట్టిగా ఉండటం వల్ల సరిగ్గా నమలకుండా మింగితే గొంతులో అడ్డుపడి శ్వాస ఆడకుండా చేసే ప్రమాదం కూడా ఉంది.

4 / 5
కానీ, చాలామంది బిర్యానీ ఆకు విషపూరితమైనది.. కాబట్టే తినకూడదు అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. బిర్యానీ ఆకులో ఎలాంటి విషపూరిత రసాయనాలు లేవు. దీని వల్ల వచ్చే ముప్పంతా దాని భౌతిక నిర్మాణం అంటే, ఆకు గట్టిదనం, పదునైన అంచుల వల్లే తప్ప, రసాయనికంగా కాదు.

5 / 5
అందుకే, సాంప్రదాయ పద్ధతిలో వంట చేసేటప్పుడు ఆకును వేసి, అది తన సువాసనను, నూనెలను ఆహారంలోకి విడుదల చేసిన తర్వాత, వడ్డించే ముందు ఆకును తీసి పక్కన పడేయడం ఉత్తమం. లేదంటే, బిర్యానీ ఆకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కావాలనుకుంటే, దానిని ఎండబెట్టి మెత్తటి పొడిగా చేసి గరం మసాలాల్లో వాడుకోవచ్చు. ఈ రూపంలో తీసుకోవడం వల్ల పీచు సమస్య ఉండదు. సురక్షితంగా జీర్ణమవుతుంది.పైగా, ఈ బిర్యానీ ఆకు కూరలకు అద్భుతమైన ఫ్లేవర్‌ను ఇవ్వడంతో పాటు యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. కాబట్టి వంటల్లో దీనిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు, కానీ ప్లేట్ లోకి రాగానే మాత్రం ఆకును పక్కన పెట్టేయడమే అందరికీ సురక్షితం!

Follow Us