
ఒక వయస్సు వచ్చిన తరవాత అందరికీ ముందు వచ్చే సమస్య ఎముకలు బలహీనంగా అవ్వడం అలాంటి వాళ్లు వీలైనంత వరకు మంచి ఆహారాలు తీసుకోవాలి. మీ శరీరానికి బలాన్ని ఇచ్చేవి మాత్రమే తీసుకోవాలి. పాత కాలం నుంచి తింటున్న ఆహారం ఇది. మీరు రోజూ ఒక టేబుల్ స్పూన్ తింటే చాలు ఆరోగ్యంగా ఉంటారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఒక స్పూన్ తింటే చాలు .. ముందుగా మీరు ఈ నల్ల నువ్వులను తినడం అలవాటు చేసుకోవాలి. వట్టిగా తినలేము అనేవాళ్ళు దీనిలో ఏదైనా తీపి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో బెల్లం వేసుకున్నా అదిరిపోయే టేస్ట్ వస్తుంది. నేరుగా అయినా తినొచ్చు. లేక వీటిని మిక్సీ లో మెత్తగా పొడిలాగా చేసుకుని అయినా దీన్ని తీసుకోవచ్చు.

ఈ నల్ల నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి అందుకే వీటిని చాలా మంది తింటారు. మీకు ఎప్పుడైనా మీ ఎముకలు బలహీనంగా ఉన్నట్లు మీకు అనిపిస్తే వెంటనే వీటిని తినండి. ఆ సమస్య నుంచి కొద్దీ రోజుల్లోనే కోలుకుంటారు. పైగా ఇది నేచురల్ ఫుడ్ కూడా వీటిని తినడం అస్సలు మిస్ చేయకండి

అప్పటి నుంచి అందుబాటులో.. తాత ముత్తాత సమయంలో ఎముకలు విరిగితే ఇలాగే తినేవాళ్లు. అప్పట్లో ఎలాంటి మందులు లేవు అంతా నేచురల్ గానే తీసుకునేవాళ్లు. ఈ చిట్కా పాత కాలం నుంచి ఫాలో అవుతున్నారు మీరు దీనిని పాటిస్తే మంచి రిజల్ట్ చూస్తారు.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)