Gold Price Today: దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తులంపై భారీగా పెరుగుదల!

Updated on: Mar 28, 2026 | 10:14 AM

Gold, Silver Prices: ఇటీవల నుంచి బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వచ్చాయ. రికార్డు స్థాయిలో తగ్గుతూ అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇక వైపు యుద్దం కొనసాగుతుంటే మరో వైపు బంగారం ధరలు దిగి రావడం మహిళలకు ఉపశమనం కలిగిస్తున్నాయనే చెప్పాలి..

1 / 5
 Gold Price Today: బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. గత రెండు రోజులుగా పరుగులు పెడుతున్నాయి. భారీగా తగ్గాయని ఆనందపడ్డలోగానే మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి.

2 / 5
 తాజాగా మార్చి 28వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాములపై ఏకంగా 2,510 రూపాయలు  పెరిగింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 2,300 వరకు ఎగబాకింది. ఇదే విధంగా 18 క్యారెట్ల 10 గ్రాములపై1880 రూపాయల వరకు పెరిగింది.

3 / 5
 హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,090 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,750 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,070 వద్ద కొనసాగుతోంది.

4 / 5
 ఇక వెండి విషయానికొస్తే దీనిపై కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో ఏకంగా 5 వేల రూపాయల వరకు ఎగబాకింది. కిలో వెండి ధర రూ.2,50,000, ఇతర నగరాల్లో ఇంకాస్త తక్కువగా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.2,45,000 వద్ద ట్రేడవుతోంది.

5 / 5
 అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం వ్యాపారం ప్రధానంగా అమెరికన్ డాలర్‌లోనే జరుగుతుంది. డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలతో కొనుగోలు చేసే వారికి బంగారం ఖరీదుగా అనిపిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల సహజంగానే బంగారం ధరలపై ప్రభావం పడుతుంది.

Follow Us