SBI కార్డ్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన లేట్ ఫీజు.. కొత్త నిబంధనలు ఇవే!

Updated on: May 04, 2026 | 5:32 PM

SBI Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ ఖర్చులను పర్యవేక్షించుకుంటూ, గడువులోపు బిల్లులు చెల్లించడం ద్వారా అదనపు ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేసినట్లయితే తీవ్రమైన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది..

1 / 6
 మీరు SBI క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఎస్‌బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తన ఛార్జీలు, రివార్డ్ పాయింట్లు మరియు వార్షిక రుసుము మాఫీ (Annual Fee Waiver) నిబంధనలలో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. వీటివల్ల సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ఆ మార్పులేంటో ఒకసారి పరిశీలిద్దాం.

2 / 6
 1. పెరిగిన లేట్ పేమెంట్ ఛార్జీలు: మే 1 నుండి ఎస్‌బీఐ కార్డ్ లేట్ పేమెంట్ ఛార్జీలను సవరించింది. గడువు ముగిసిన తర్వాత బిల్లు చెల్లిస్తే చెల్లించాల్సిన జరిమానా ఇప్పుడు మరింత భారంగా మారింది. మీ బకాయి రూ.100 నుండి రూ.500 లోపు ఉంటే, ఇకపై రూ.100 లేట్ ఫీజు చెల్లించాలి. అలాగే బకాయి మొత్తం పెరిగేకొద్దీ ఈ ఛార్జీలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అందుకే సకాలంలో బిల్లు చెల్లించడం ఇప్పుడు చాలా ముఖ్యం.

3 / 6
 2. వార్షిక ఫీజు మాఫీ కష్టమే:  చాలామంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఏడాదికి కొంత మొత్తం ఖర్చు చేసి, వార్షిక రుసుమును మాఫీ (Fee Waiver) పొందుతుంటారు. అయితే పాపులర్ అయిన BPCL SBI క్రెడిట్ కార్డ్ విషయంలో ఈ నిబంధన కఠినతరమైంది. గతంలో ఏడాదికి రూ.50,000 ఖర్చు చేస్తే రూ.499 వార్షిక ఫీజు మాఫీ అయ్యేది. ఇకపై ఈ ఫీజు మాఫీ పొందాలంటే కనీసం రూ.1 లక్ష ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఖర్చు పరిమితిని కంపెనీ రెట్టింపు చేసింది.

4 / 6
 3. రివార్డ్ పాయింట్లపై పరిమితి: ఏప్రిల్ 1 నుండే రివార్డ్ పాయింట్ల వినియోగంపై కొత్త రూల్స్ వచ్చాయి. ఒక నెలలో గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్లను మాత్రమే రిడీమ్ (Redeem) చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాకుండా, పాయింట్లను 4,000 మల్టిపుల్స్‌లో (గుణిజాలు) మాత్రమే ఉపయోగించుకోవాలి.

5 / 6
 4. బకాయిల వసూలు - కఠిన చర్యలు: సకాలంలో బిల్లులు చెల్లించని వారిపై ఎస్‌బీఐ కార్డ్ కఠినంగా వ్యవహరించనుంది. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్‌తో పాటు అవసరమైతే థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా బకాయిల వసూలుకు ప్రయత్నిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో కస్టమర్ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు (CIBIL వంటివి) నివేదిస్తుంది. అయితే దీనికి ముందు కస్టమర్‌కు ఒక నెల నోటీసు ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

6 / 6
 సూచన: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ ఖర్చులను పర్యవేక్షించుకుంటూ, గడువులోపు బిల్లులు చెల్లించడం ద్వారా అదనపు ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేసినట్లయితే తీవ్రమైన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. పైగా మీ సిబిల్‌ దెబ్బతింటుందని గుర్తించుకోండి.

Follow Us