
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి భారత్‌లో కొత్త కారును లాంచ్ చేస్తోంది. మారుతి సుజుకి 2022 గ్రాండ్ విటారా పేరుతో తీసుకొస్తున్న ఈ కారుకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.

సెప్టెంబర్‌లో అధికారికంగా లాంచ్ కానున్న ఈ కారును మొత్తం ఐదు మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లను, రెండు స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్‌లను అందిస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ. 18 లక్షల వరకు ఉండొచ్చు.

ఈ కారు లీటర్‌కి 27.9 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక అంతేకాకుండా ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో వస్తున్న తొలి SUV కారుగా గ్రాండ్ విటారా నిలిచింది. ఈ కారును రెండు ఇంజిన్ వేరియంట్‌లు- మైల్డ్, స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో తీసుకొస్తున్నారు.

ఈ ఇంజన్‌లు 1.5-లీటర్ యూనిట్లు, డిఫరెంట్ పవర్‌ను విడుదల చేయనున్నారు. 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ 101 bhp, 136 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో వస్తుంది.

ఈ కారు లెంథ్ 4345 ఎమ్‌ఎమ్, విడ్త్ 1795 ఎమ్‌ఎమ్, హైట్ 1645 ఎమ్‌ఎమ్, వీల్‌బేస్ 2600 ఎమ్‌ఎమ్ డైమెన్షన్స్‌తో ఉంది. మారుతి బ్రీజాతో పోలిస్తే విటారా పొడవుగా ఉంటుంది.