
ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా గ్యా్స్ సిలిండర్ వాడుతుంటారు. ఇటీవల కేంద్రం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల రూల్స్‌లో అనేక మార్పులు చేస్తోంది. ఇక గ్యాస్ సిలిండర్ వాడాలంటే రెగ్యూలేటర్ అనేది అవసరం. సిలిండర్ నుంచి స్టవ్‌కు గ్యాస్‌ను సరఫరా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. అయితే చాలామంది ఏళ్ల తరబడిగా ఒకే పైప్‌ను వాడుతుంటారు. ఇలా వాడటం వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి.

చాలామంది నాణ్యత లేని, పాతబడిన పైప్‌లను అలాగే వాడుతుంటారు. దీని వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశముంది. ఇక ఐఎస్‌ఐ మార్క్ ఉన్న నాణ్యమైన పైప్‌లను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ ఐదేళ్లకు ఒకసారి గ్యాస్ పైప్‌ను మార్చాలి. పైప్ జీవితకాలం 5 ఏళ్లు మాత్రమే ఉంటుంది.

5 ఏళ్ల తర్వాత పైప్ మార్చుకోవాలని రూల్స్ చెబుతున్నాయి. పైప్ పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ.. ఏళ్ల తరబడి వాడటం వల్ల లోపలి భాగం బలహీనపడి ఉండొచ్చు. పాత పైప్‌ల వల్ల గ్యాస్ లీకేజీ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ లీకైనప్పుడు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి సిలిండర్ పేలుతుంది. దీని వల్ల మీ ఇంటితో పాటు చుట్టపక్కన నివాసం ఉంటున్నవారికి కూడా నష్టం జరుగుతుంది.

కొన్నిసార్లు ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించవచ్చు. పైపుపై పగుళ్లు లేదా రంధ్రాలు కనిపిస్తుంటే వెంటనే మార్చుకోవాలి. ఇక కనెక్షన్లు దెబ్బతినప్పుడు, చివరి భాగాల్లో తుప్పు పట్టినప్పుడు, పైప్ గట్టిగా మారినప్పుడు వెంటనే మార్చుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైప్ మార్చేటప్పుడు రెగ్యూలేటర్ నాబ్ ఆపేయాలి.

స్టవ్, రెగ్యూలేటర్‌కు కరెక్టుగా ఫిట్ అయ్యే పైప్‌ను మాత్రమే అమర్చాలి. భద్రతా క్లాంప్‌లు బిగించాలి. మీకు బిగించడం తెలియకపోతే టెక్నీషియన్ లేదా గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్ సాయం తీసుకోండి. గట్టిగా బిగించకపోతే గ్యాస్ లీకయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోండి.