Bullet Trains: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై బిగ్ అప్డేట్ వచ్చేసింది.. పనుల్లో కీలక స్టెప్.. ఇక రెడీ అయినట్లే..

Updated on: Nov 01, 2026 | 1:13 PM

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ట్రాక్, సబ్ స్టేషన్ల పనులు పుంజుకున్నాయి. తొలి ట్రైన్ ముంబై-అహ్మదాబాద్ మార్గంలో ప్రారంభం కానుండగా.. మొత్తం 14 సబ్ స్టేషన్లు ఉండున్నాయి. అలాగే 12 స్టేషన్లు ఉంటాయి.

1 / 5
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌ కారిడార్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ కారిడార్ తొలుత ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గంలో 2027 ఆగస్ట్ 15న తొలి బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కించాలని ఇప్పటికే రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్న క్రమంలో.. ఆ దిశగా పనులు షురూ అయ్యాయి. 508 కిలోమీటర్ల మేర ఈ మార్గం ఉండనుండగా.. తొలి సబ్ స్టేషన్ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయి.

2 / 5
ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 14 సబ్‌స్టేషన్లు నిర్మించనుండగా.. ఇవి బుల్లెట్ ట్రైన్ల వ్యవస్థ నడిపేందుకు విద్యుత్ సరఫరా చేయడంలో ఉపయోగపడతాయి. తొలి ట్రాక్షన్ సబ్‌స్టేషన్ గుజరాత్‌లోని నవసారి జిల్లా బిలిమోరాలో నిర్మిస్తున్నారు. ఇది దాదాపు పూర్తి అయినట్లు హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దాదాపు 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇది రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ పరికరాల పరీక్ష, కమిషనింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక కంట్రోల్ ప్యానెల్, ట్రాన్స్‌ఫార్మర్, సర్క్యూట్ బ్రేక్, చేంజ్ ఓవర్ స్విచ్ భనాల పనులు పూర్తి కావొచ్చాయి.

3 / 5
బుల్లెట్ రైళ్ల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్న విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ది చేస్తున్నారు. జపాన్‌కు చెందిన షింకన్సెన్ టెక్నాలజీ వీటికి ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం 4 సబ్ స్టేషన్లు ఉండనున్నాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, థానే, విరాల్, బోయిసర్ ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. గుజరాత్‌లోని వాపి, బలిమోరా, సూరత్, భరచ్, వడోదర, ఆణంద్, అహ్మదాబాద్, సబర్మతి నగరాలను కలుపుతూ 9 సబ్‌స్టేషన్లు నిర్మించనున్నారు.

4 / 5
బిలిమోరా సబ్ స్టేషన్‌ను గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన 220 kV అంబేతా గ్రిడ్‌కు అనుసంధానిస్తున్నారు. మొత్తం 12 బుల్లెట్ రైల్వే స్టేషన్లు ఉండనున్నాయి. ముంబై (బాంద్రా-కుర్లా), థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, స్వరూపం, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి వంటి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. ఈ బుట్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తయితే కేవలం 3 గంటల్లోపే ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కొన్ని స్టేషన్లలో మాత్రమే ట్రైన్ ఆగితే 2 గంటల 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.

5 / 5
ఈ మార్గంలో సూరత్-బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల దూరానికి తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. 2029-30 నాటికి ఈ  మార్గం మొత్తం పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. మహారాష్ట్రంలో ప్రస్తుతం భూసేకరణ పనులు చేపడుతున్నారు. ఈ మార్గంలో బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంగా నడవనున్నాయి

Loading...
Unable to load recommendations.
Follow Us