Promissory Note: ప్రామిసరీ నోటు ఎలా రాయాలి.? ఎన్ని రూపాయల వరకు రాయొచ్చు..

Updated on: Apr 24, 2026 | 7:19 PM

ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు రాయడం ఎందుకు ముఖ్యం.? అసలు ఒక సరైన ప్రామిసరీ నోటును చట్టబద్ధంగా ఎలా రాయాలి? అందులో ఉండాల్సిన కీలక అంశాలు, ఆ నోటుకు ఉండే కాలపరిమితి గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి.

1 / 5
మనం ఎవరికైనా ఆర్థిక సాయం చేసినప్పుడు లేదా అప్పు ఇచ్చినప్పుడు, ఆ నమ్మకానికి ఒక చట్టపరమైన ఆధారం ఉండటం చాలా ముఖ్యం. అందులో ప్రామిసరీ నోటు ప్రాథమికమైనది. అసలు ప్రామిసరీ నోటు అంటే ఏమిటంటే, అప్పు తీసుకున్న వ్యక్తి 'నేను ఇంత సొమ్మును, ఇంత వడ్డీతో, ఫలానా గడువులోగా తిరిగి చెల్లిస్తాను' అని రాసి ఇచ్చే ఒక హామీ పత్రం. ఇది కేవలం ఒక కాగితం కాదు, చట్టం దృష్టిలో ఒక బలమైన సాక్ష్యం.

2 / 5
చాలామంది ప్రామిసరీ నోటు రాసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. నోటుపై రెవెన్యూ స్టాంపు కచ్చితంగా ఉండాలి. దానిపై అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం లేదా వేలిముద్ర ఉండాలి. అలాగే, అప్పు తీసుకున్న తేదీ, వడ్డీ రేటు, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండటం ఎంతో అవసరం.

3 / 5
ఈ నోటు రాసిన తేదీ నుంచి కేవలం మూడు సంవత్సరాల వరకు మాత్రమే దీనికి చట్టపరమైన చెల్లుబాటు(Validity) ఉంటుంది. ఆ గడువు లోపల డబ్బు తిరిగి రాకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్వాలి. ఒకవేళ మీరు అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటుతో పాటు సెక్యూరిటీగా చెక్కు కూడా తీసుకుంటే, అది ఇంకా అదనపు భద్రతను ఇస్తుంది.

4 / 5
ఒకవేళ ఆ చెక్కు బౌన్స్ అయితే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు. కేవలం మౌలిక ఒప్పందాల మీద ఆధారపడకుండా, ఇలాంటి లిఖితపూర్వక ఆధారాలను సిద్ధం చేసుకోవడం వల్ల మీ కష్టార్జితానికి రక్షణ ఉంటుంది. అప్పు ఇచ్చేటప్పుడు మొహమాటపడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది.

5 / 5
అప్పు ఇచ్చేటప్పుడు ఇద్దరు నమ్మకస్తులైన సాక్షుల సంతకాలను తీసుకోవడం మంచిది. వివాదాలు తలెత్తినప్పుడు వీరి సాక్ష్యం కోర్టులో మీకు ఎంతో సాయంగా మారుతుంది. అలాగే అందరూ చేసే తప్పులు మీరు ప్రామిసరీ నోటు చేసేటప్పుడు చేయకండి.

Follow Us