
Gold Price Today: క్రమంగా దిగి వస్తున్న బంగారం ధరలకు నాలుగైదు రోజుల కిందట ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అయితే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు రెండు రోజుల నుంచి మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు రోజుల కిందట తులం బంగారం ధర రూ.1,62,000లకుపైగా వెళ్లగా, ప్రస్తుతం భారీగానే దిగి వచ్చింది.

మే 13వ తేదీన తులం బంగారం ధర రూ.1,62,000 ఉండగా, మే 16వ తేదీన అంటే మూడు రోజుల్లోనే భారీగా దిగి వచ్చింది. ప్రస్తుతం మే 16న మధ్యాహ్నం సయమానికి తులం బంగారంపైఊ రూ.980 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ధర తగ్గిన తర్వాత తులం బంగారం ధర రూ.1,56,930 వద్దకు చేరుకుంది. అంటే ఈ మూడు రోజుల్లోనే 5 వేలకుపైగా దిగి వచ్చింది.

అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.900 వరకు తగ్గి రూ.1,43,850 వద్ద కొనసాగుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 730 రూపాయలు దిగి వచ్చి ప్రస్తుతం రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. అదే స్థాయిలో దిగి రావడం కొంత ఉపశమనం కలుగుతుందనే చెప్పాలి. కొన్ని రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ధరలు పెరిగినట్లయితే సామాన్యులకు పెను భారంగా మారనుంది.

వెండి కూడా భారీగానే దిగి వచ్చింది. కిలో పై ఏకంగా10 వేల రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం వెండి ధర రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నై, కేరళలో మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ రూ.2,90,000 వద్ద ట్రేడవుతోంది. అంటే ఇతర ప్రాంతాలకంటే ఈ మూడు ప్రాంతాల్లో రూ.10 వేల వరకు ఎక్కువగా ఉందనే చెప్పాలి.

హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,930 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,850 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు ప్రభావంతో బంగారం ధరలు మరోసారి ఒత్తిడికి గురయ్యాయి. మార్కెట్‌లో 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. ముఖ్యంగా కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.10 వేల వరకు తగ్గడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.