
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ధరలు మళ్లీ ఒక్కసారి పుంజుకున్నాయి. గత కొద్దిరోజులుగా ధరలు పడిపోతుండగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ధరలు ఉన్నట్లుండి పెరగడంతో కొనుగోలుచేసేవారు నిరాశ చెందుతున్నారు. గోల్డ్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అనేది ఎవరూ ఊహించలేరు. ఈ పెరుగుదల తర్వాత అక్టోబర్ 9న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,710కి చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే రూ.1140 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,38,150కి చేరుకోగా.. నేడు రూ. 1050 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,710 వద్ద ప్రస్తుతం కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,150 వద్ద ఉంది. ఇక బెంగళూరు విషయానికొస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,50,710 వద్ద ఇప్పుడు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,150 వద్ద ట్రేడవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,860 వద్ద ఉండగా.. శుక్రవారం రూ.1160 పెరిగాయి. 22 క్యారెట్ల ధర రూ.1,38,300 వద్ద కొనసాగుతున్నాయి. అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద ప్రస్తుతం ఉన్నాయి. నిన్న ఆ ధర రూ.2.35 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.45 లక్షలుగా ఉండగా.. చెన్నైలో రూ.2.45 లక్షలుగా ఉంది.