Credit Card: పండుగ షాపింగ్‌ చేసేటప్పుడు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే బాధపడాల్సిందే..

Updated on: Oct 11, 2026 | 8:35 AM

పండుగల సమయం కావడంతో చాలామంది షాపింగ్ చేస్తున్నారు. ఇంట్లోకి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. పండుగ ఆఫర్లు కూడా ఉండటంతో తగ్గింపు ధరకు వస్తాయనే కారణంతో అవసరం లేని వ్యక్తులను కూడా కొంతమంది కొనుగోలు చేస్తుంటారు. డబ్బులు చేతిలో లేకపోయిపనా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తారు.

1 / 5
దసరా, దీపావళి లాంటి వరుస పండుగల క్రమంలో చాలామంది ముందుగానే షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్స్ మాల్స్, ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్ సైట్లు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. ఇంట్లోకి అవసరమైన ఫ్రిడ్జ్, ఏసీలు, వాషింగ్ మెషిన్ల లాంటి వాటితో పాటు స్మార్ట్ ఫోన్లపై భారీగా ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేసేవారికి భారీ తగ్గింపులు, ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు

2 / 5
కొంతమంది డబ్బులు లేకపోయినా ఆఫర్ల మోజులో పడి క్రెడిట్ కార్డు ద్వారా విచ్చలవిడిగా పేమెంట్స్ చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఆర్ధిక భారం పెరిగి ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. బిల్లు సకాలంలో చెల్లించకపోతే పెద్ద మొత్తంలో వడ్డీతో పాటు అదనపు చార్జీలు, ఆలస్య చార్జీలు, జీఎస్టీ పడతాయి. దీంతో పెద్ద మొత్తంలో పేమెంట్స్ చేసేవారు ఒకసారి ఆలోచించుకోవాలి

3 / 5
ఇక నో కాస్ట్ ఈఎంఐల మాయలో కూడా పడొద్దు. ప్రస్తుత పండుగ సీజన్‌లో ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి ఆఫర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీ, ఇతర అదనపు ఛార్జీలు పడతాయి. దీంతో ఈ చార్జీల రూపంలో కస్టమర్‌పై అదనపు భారం పడుతుంది. కొనుగోలు చేసేటప్పుడు వీటిని పరిశీలించాలి

4 / 5
కానీ పండుగ షాపింగ్ సమయంలో క్రెడిట్ కార్డును తెలివిగా వాడితే బెనిఫిట్ పొందవచ్చు. మీ షాపింగ్‌కు ఎంత బడ్జెట్ అవుతుందనేది ముందుగానే నిర్ణయించుకోండి. ఆ పరిమితికి మంచి కార్డును వాడకండి. ఆ తర్వాత క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించండి. దీని వల్ల మీరు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉంటారు.

5 / 5
పండుగ షాపింగ్ సమయంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. క్రెడిట్ కార్డుల నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసే సమయంలో ఒకసారి ఆ వస్తువు అవసరమా.. కాదా అనేది ఒకసారి పున:పరిశీలన చేసుకోండి. తక్షణ అవసరం అనుకుంటేనే కొనుగోలు చేయండి. ఆఫర్లు మాయలో పడి అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయకండి.

Loading...
Unable to load recommendations.
Follow Us