EPFO: మీ జీతం రూ.25 వేలు అయితే పెన్షన్ ఎంత వస్తుంది..? పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఈ లెక్కలు తెలుసుకోండి..

Updated on: Oct 18, 2026 | 10:18 PM

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు పెన్షన్ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దీంతో ప్రతీ నెలా పాస్‌బుక్‌లో మీ పెన్షన్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ జీతం రూ.25 వేలుగా ఉంటే.. మీకు ఎంత పెన్షన్ వస్తుంది..? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

1 / 5
కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17వ తేదీ నుంచే ఇది అమల్లోకి రావడంతో.. గత నెల జీతాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పరిమితి పెరగడం వల్ల నెలవారీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరిగింది. దీని వల్ల టేక్ హోం శాలరీ తగ్గగా.. దీర్ఘకాలంలో పొదుపు పెరుగుతుంది. అయితే మీరు పెన్షన్‌కు అర్హత సాధిస్తే.. కొన్ని ముఖ్య నియమాలు తెలుసుకోవడం అవసరం

2 / 5
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(EPS) కేంద్రం అమలు చేస్తోంది. మీ పూర్తి జీతం ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరుగుతుంది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం పించన్‌కు అర్హత గల జీతం రూ.15 వేలుగా ఉంది. నెలవారీ పింఛన్=పింఛన్ అర్హత గల జీతం × పింఛను అర్హత గల సర్వీస్) ÷ 70 ఫార్ములా ప్రకారం పెన్షన్ లెక్కిస్తారు. మీ జీతం రూ.25 వేలుగా ఉన్నా.. రూ.15 వేలు పరిమితి ప్రకారం పెన్షన్ లెక్కిస్తారు.

3 / 5
30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే నెలవారీ పింఛన్ రూ.6857 లభిస్తుంది. పెన్షన్ అర్హత గల జీతం రూ.15 వేలుగా ఉండగా.. 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నప్పుడు 2 ఏళ్ల వెయిటేజీ వస్తుంది. దీంతో 15,000 × 32 ÷ 70 ప్రకారం నెలకు రూ.6857 వస్తుంది.

4 / 5
50 ఏళ్ల వయస్సులో పెన్షన్ తీసుకుంటే.. నెలవారీ పెన్షన్‌లో కోత విధిస్తారు. ప్రతీ సంవత్సరానికి 4 శాతం తగ్గిస్తారు. 50 ఏళ్లప్పుడే పింఛన్ పొందాలనుకునేవారికి దీని వల్ల నష్టమే జరుగుతుంది. పెన్షన్ 58 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది. 8 ఏళ్ల ముందుగానే తీసుకోవడం వల్ల పెన్షన్‌లో మొత్తం 32 శాతం కోత ఉంటుంది

5 / 5
55 ఏళ్ల వయస్సులో తీసుకుంటే నెలకు రూ.6034 వస్తుంది. అంటే 12 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇక 56 ఏళ్లప్పుడు తీసుకుంటే రూ.6309 వస్తుంది. అంటే 8 శాతం తగ్గుతుంది. ఇక 58 ఏళ్ల తర్వాత తీసుకుంటే అదనంగా 4 శాతం పెన్షన్ లభిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us