EPFO: పీఎఫ్ కొత్త విత్ డ్రా రూల్స్.. ఏ అవసరానికి ఎంత తీసుకోవచ్చంటే..? నిబంధనలు ఇవే..

Updated on: Oct 15, 2026 | 1:50 PM

ఈపీఎఫ్ఓ విత్ డ్రా రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. గతంలో ఉన్న విత్ డ్రా నిబంధనలను మార్చింది. గతంలో పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అనేక కేటగిరీలు ఉండగా.. ఇప్పుడు కేవలం ఐదు కేటగిరీలు మాత్రమే ప్రవేశపెట్టింది. ఈ ఐదు కారణాలు చూపించి మీరు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

1 / 5
పీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగంలో ఉన్నప్పుడే తమ నిధులను పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. తమ బ్యాలెన్స్‌లో కొంత మొత్తాన్ని ఆర్ధిక అవసరాల కోసం ఉపసంహరించుకోవచ్చు. వివిధ కారణాలు చూపించి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఇటీవల కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. గతంలో ఉన్న విత్ డ్రా రూల్స్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏయే అవసరాలకు నిధులు ఉపసంహరించుకోవచ్చనేది ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఉద్యోగంలో ఉన్నప్పుడే మీకు డబ్బులు అత్యవసరమైతే వివిధ కారణాలు చూపించి మీ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు మీ అకౌంట్లో రూ.లక్ష ఉంటే రూ.75 వేల వరకు ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగి, యజమాని, పీఎఫ్ వడ్డీ మొత్తంలో 75 శాతం వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇందుకోసం పీఎఫ్ వెబ్ సైట్లో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

3 / 5
అయితే పీఎఫ్ పాక్షికంగా విత్ డ్రా చేసుకోవాలంటే.. 12 నెలల సర్వీస్ పీరియడ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 12 నెలలపాటు సభ్యత్వంలో ఉన్నవారు 75 శాతం వరకు ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక ఉద్యోగం కోల్పోయినప్పుడు కూడా వెంటనే 75 శాతం నిధులు తీసుకోవచ్చు. ఇక 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే మిగిలిన 25 శాతం కూడా ఉపసంహరించుకోవచ్చు.

4 / 5
ఇక వైద్య ఖర్చుల కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా ఈ కేటగిరీ కింద పాక్షికంగా కొంత మొత్తం తీసుకోవచ్చు. మీకు ఆరోగ్య పరిస్థితి లేకపోయినా లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల కోసం తీసుకునేందుకు అనుమతి ఉంది. ఇందుకోసం వైద్య కేటగిరీ కింద క్లెయిమ్ సమర్పించాల్సి ఉంది. క్లెయిమ్ చేసిన మూడు రోజుల్లో అకౌంట్లో జమ అవుతాయి.

5 / 5
అలాగే ఉద్యోగులు తమ వివాహ ఖర్చుల కోసం పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. తమ ఉద్యోగ  జీవితంలో గరిష్టంగా ఐదుసార్లు ఉపసంహరించుకోవచ్చు. ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఇక పిల్లల ఎడ్యుకేషన్ అవసరాల కోసం కూడా ఉపసంహరించుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us