
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని జమ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం మంది ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు పడగా.. ఈ నెల 15వ తేదీల్లోపు అందరికీ వేయనున్నట్లు ఈపీఎఫ్ఓ ఇప్పటికే ప్రకటించింది. కేంద్రం జమ చేయడంలో ఖాతాదారులందరూ తమ పీఎఫ్ వడ్డీని చెక్ చేసుకుంటున్నారు. అయితే ఎలా చెక్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దాం.

పీఎఫ్ వడ్డీ చెక్ చేసుకోవాలంటే మీ యూఏఎన్ యాక్టివ్‌గా ఉండాలి. వడ్డీ జమ అయిందా. .లేదా చూసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ పోర్టల్, ఉమాంగ్ యాప్, ఎస్‌ఎంఎస్, మిస్డ్ కాల్ విధానాల్లో తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి వెళ్లి పాస్ బుక్ సర్వీస్ ఎంచుకోవాలి. యూఏఎన్ నెంబర్ ,పాస్ వర్డ్, క్యా్ప్చా ఎంటర్ చేయాలి. అనంతరం మీ కంపెనీని ఎంచుకోవాలి. పాస్‌బుక్‌లో 2025 ఆప్షన్ ఎంచుకోవాలి. వడ్డీ ఎంత జమ అయిందనే వివరాలు పాస్ బుక్‌లో కింద కనిపిస్తాయి.

ఇక ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకోవాలంటే.. ముందుగా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి పీఎఫ్ సర్వీసులు ఎంచుకోవాలి. పాస్ బుక్ ఆప్షన్ ఎంచుకుని యూఏఎన్ ఎంటర్ చేయాలి. మీ కంపెనీని ఎంచుకోవాలి. అక్కడ పీఎఫ్ పాస్‌బుక్ వివరాలు కనిపిస్తాయి. అందులో వడ్డీ ఎంత పడిందనేది తెలుసుకోవచ్చు. అవసరమైతే దానిని పీడీఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇక ఎస్‌ఎంఎస్ రూపంలో పొందాలంటే.. ‘EPFOHO యూఏఎన్ నెంబర్ మీ భాష(EN) అని టైప్ చేసి 7738299899కు మెస్సేజ్ పంపాలి. మీ అకౌంట్ ప్రస్తుత బ్యాలెన్స్ వివరాలతో పాటు గత కాంట్రిబ్యూషన్ వివరాలు అందుతాయి. మీ బ్యాలెన్స్ పెరిగే వడ్డీ జమ అయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగులో బ్యాలెన్స్ వివరాలు పొందాలనుకుంటే EPFOHO యూఏఎన్ నెంబర్ TEL ఫార్మట్‌లో పంపాల్సి ఉంటుంది.

9966044425 నెంబర్‌కు ఈపీఎఫ్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి. రెండు రింగ్స్ తర్వాత ఆటోమేటిక్‌గా కాల్ కట్ అవుతుంది. అనంతరం మీ మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో బ్యాలెన్స్ వివరాలు అందుతాయి. ఈ విధానం ద్వారా వడ్డీ జమ అయిందా... లేదా అనేది తెలుసుకోవచ్చు.