
Bonus Shares: స్మాల్ క్యాప్ కేటగిరిలోని టెక్స్‌టైల్స్ సెక్టార్ అవాక్స్ అప్పారెల్స్ అండ్ ఆర్నమెంట్స్ కంపెనీ మ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తెచ్చింది. స్టాక్ ఏప్రిల్ 7న మార్కెట్లో 'X బోనస్ స్టాక్'గా ట్రేడ్ కానుంది. కంపెనీ అర్హులైన పెట్టుబడిదారులకు ఒక షేరుకు 3 బోనస్ షేర్లను ఇవ్వనుంది. ఈ అప్‌డేట్ చాలా మంది పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ తేదీ వరకు కంపెనీ షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులు బోనస్‌కు అర్హులు.

కంపెనీ ప్రకారం.. రూ. 10 ముఖ విలువ గల ఒక షేరును రెండుగా విభజించారు. స్టాక్ స్ప్లిట్ తర్వాత, కంపెనీ షేరు ముఖ విలువ ఒక్కో షేరుకు రూ. 5 అయ్యింది. కంపెనీ షేరు మార్చి 27, 2026న ఎక్స్-స్ప్లిట్ స్టాక్ ప్రాతిపదికన ట్రేడ్ చేసింది.

ఈ కంపెనీ ఏప్రిల్ 7న స్టాక్ మార్కెట్‌లో X బోనస్ స్టాక్‌గా ట్రేడ్ కానుంది. అర్హులైన పెట్టుబడిదారులకు ఒక షేరుకు 3 బోనస్ షేర్లను ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. కంపెనీ పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ఇవ్వడం ఇదే మొదటిసారి. అయితే బోనస్ ఇష్యూ అంటే కంపెనీలు తమ ప్రస్తుత వాటాదారులకు ఉచితంగా ఇచ్చే అదనపు షేర్లు. ఇది కంపెనీ మొత్తం షేర్ల సంఖ్యను పెంచుతుంది. పెట్టుబడిదారుడి హోల్డింగ్ విలువను అదే మొత్తంలో మారుస్తుంది.

గత గురువారం నాడు కంపెనీ షేరు 1.82 శాతం పెరిగి రూ. 168 వద్ద ముగిసింది. గత మూడు నెలల్లో కంపెనీ షేర్లు 65 శాతం లాభపడ్డాయి. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 179 శాతం రాబడిని ఇచ్చింది. దీనివల్ల పొజిషనల్ ఇన్వెస్టర్లకు చాలా ప్రయోజనం చేకూరింది.

బీఎస్ఈలో షేరు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 168 వద్ద, కనిష్ఠ స్థాయి రూ. 50.13 వద్ద నమోదైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 34.92 కోట్లుగా ఉంది. కంపెనీ ప్రమోటర్లు 41.97 శాతం వాటాను కలిగి ఉండగా, మిగిలిన వాటాలో వినియోగదారులున్నారు. నోట్: టీవీ9 ఏ స్టాక్, మ్యూచువల్ ఫండ్, ఐపీఓలోనూ పెట్టుబడి పెట్టమని సలహా ఇవ్వదు. ఇక్కడ కేవలం సమాచారం మాత్రమే అందిస్తున్నాము. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుడిని లేదా ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.