
ట్రాయ్ కొత్త రీఛార్జ్ రూల్స్ను అక్టోబర్ 21వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తుంది. ఈ నిబంధనల్లో భాగంగా టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. తక్కువ చెల్లుబాటు అయ్యే కాలానికి వాయిస్ ప్లస్ ఎస్ఎంఎస్ ప్లాన్లను తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది. అలాగే వాయిస్, ఎస్ఎంఎస్, డేటా లభించే ప్లాన్లు 30 రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా తీసుకురావాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ క్రమంలో టెలికాం కంపెనీలు కొత్త ప్లాన్లను లాంచ్ చేస్తున్నాయి.

ఈ క్రమంలో టెలికాం రూల్స్ ప్రకారం ఎయిర్ టెల్ కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.185, రూ.203, రూ.206 వాయిస్, ఎస్ఎంఎస్ ప్లా్న్లను లాంచ్ చేసింది. రూ.185 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉండనుండగా.. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇక రూ.203 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. అన్లిమిట్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు.

రూ.206 ప్లాన్ విషయానికొస్తే.. ఒక క్యాలెండర్ నెల అందుబాటులో ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఉచిత హలో టూన్స్ ఈ మూడు ప్లాన్లలో పొందవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. అయితే మొబైల్ డేటా వీటిల్లో అందుబాటులో ఉండదు. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు మాత్రమే కావాలనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు

ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ మాత్రమే. దీంతో ప్రీపెయిడ్ సిమ్ వినియోగదారులు వీటి ప్రయోజనం పొందవచ్చు. డేటా అవసరం లేనివారికి ఈ ప్లాన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మొబైల్ వినియోగదారులు వీటిని ఉపయోగించుకోవాలని ఎయిర్టెల్ తెలిపింది. ఇక మిగతా టెలికాం కంపెనీలు కూడా 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి.

ఈ ప్లాన్లలో అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. అలాగే ఉచిత రోమింగ్స్తో పాటు ప్లాన్ కాలపరిమితిలో 300 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. డేటాతో కూడుకున్న రీఛార్జ్ ప్లాన్లు ఖరీదుగా ఉంటాయి. దీంతో తక్కువ ధరలతో కూడిన వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను తీసుకురావాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది.