Gas Cylinder: ఈ ఒక్క డాక్యుమెంట్ ఉంటే 5 కేజీల సిలిండర్ మీ సొంతం.. ధర ఎంతంటే..?

Updated on: Apr 15, 2026 | 11:02 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 కేజీల సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. గ్యాస్ కొరత క్రమంలో ఈ చోటా సిలిండర్లకు క్రేజ్ పెరిగింది. నేరుగా ఏజెన్సీకి వెళ్లి తీసుకోవడం, సులువుగా ఎక్కడైనా రీఫిల్లింగ్ చేసుకునే సౌకర్యం ఉండటంతో ఈ సిలిండర్లను ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు.

1 / 5
గ్యాస్ కొరత క్రమంలో ఇటీవల ప్రభుత్వ రంగ గ్యాస్ కంపెనీలు 5 కేజీల సిలిండర్‌ను ప్రవేశపెట్టాయి. ఈ సిలిండర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎలాంటి ప్రూఫ్ లేకుండానే నేరుగా తీసుకునే సదుపాయం ఉండటం వల్ల ఈ సిలిండర్లకు దేశంలో బాగా డిమాండ్ ఏర్పడింది.  ప్రభుత్వం గ్యాస్ సరఫరా కంపెనీలు అయిన హెచ్‌పీ, భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్ ఈ సిలిండర్లను మార్కెట్లోకి భారీగా అందుబాటులోకి తెచ్చాయి.

2 / 5
వలస కార్మికులు, విద్యార్థులు, అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి ఈ చిన్న సిలిండర్లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఛోటు పేరుతో, భారత్ పెట్రోలియం భారత్ గ్యాస్ మినీ, హిందూస్థాన్ పెట్రోలియం హెచ్‌పీ గ్యాస్ అప్పు పేరుతో ఈ సిలిండర్లను తీసుకొచ్చాయి. సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి వీటిని కొనుగోలు చేయవచ్చు.

3 / 5
5 కేజీల సిలిండర్ కోసం రూ.వెయ్యి సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సిలిండర్ పాడైనా, పోయినా కంపెనీకి జరిగే నష్టాలను భర్తీ చేసేందుకు సెక్యూరిటీ డిపాజిట్ ఉపయోగపడుతుంది. ఇక చిన్న సిలిండర్ ధర రూ.500 వరకు ఉంటుంది. ఈ సిలిండర్ పొందేందుకు కేవలం ఏదైనా ఒక గుర్తింపు పత్రం సమర్పిస్తే సరిపోతుంది.

4 / 5
ఆధార్, పాన్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఏదైనా ఒక గుర్తింపు పత్రం సమర్పిస్తే సరిపోతుంది. మీరు సిలిండర్ ఖాళీ అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఏ నగరంలో అయినా రీఫిల్ చేసుకోవచ్చు. పీఓఎస్, పంపిణీదారుడి వల్ల 15 రోజుల తర్వాత మీరు సులువుగా రీఫిల్ చేసుకోవచ్చు.

5 / 5
ఇక కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంక్‌ల వద్ద కూడా రీఫిల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం గ్యాస్ పొందాలంటే ఏజెన్సీ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత గ్యాస్ కనెక్షన్ అందిస్తారు. ఇక గ్యాస్ రీఫిల్లింగ్ చేసుకోవాలంటే ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 5 కేజీల సిలిండర్ నేరుగా వెళ్లి తీసుకోవచ్చు.

Follow Us