Indian Origin Leaders: రిషి సునాక్ మాత్రమేకాదు.. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలను శాసిస్తున్న భారతీయులు వీరే..

|

Oct 26, 2022 | 12:11 PM

సూర్యుడస్తమించని బ్రిటీష్‌ సాంమ్రాజ్య పాలనలో మగ్గిన భారతదేశం మూలల నుంచి ఒక భారతీయుడు అదే బ్రిటీష్‌ సామ్రాజ్యాధినేత కావడం ఒకింత భారతీయులు గర్వించదగ్గ విషయం. ఐతే రిషి సునాక్‌ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో..

1 / 10
భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మొదటి నల్లజాతీయుడు, మొదటి హిందువు, మొదటి భారతీయుడిగా రిషి సునాక్ రికార్డు సాధించారు. నిజానికి రిషి సునాక్ తాతలు పంజాబ్ వాసులు. రిషి భార్య అక్షతా మూర్తి కూడా భారతీయురాలే. ఆమె తండ్రి ఎన్ నారాయణ మూర్తి దేశంలోనే పెద్ద పారిశ్రామికవేత్త. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ స్థాపకుడు నారాయణమూర్తి కావడం విశేషం. కాగా సూర్యుడస్తమించని బ్రిటీష్‌ సాంమ్రాజ్య పాలనలో మగ్గిన భారతదేశం మూలల నుంచి ఒక భారతీయుడు అదే బ్రిటీష్‌ సామ్రాజ్యాధినేత కావడం ఒకింత భారతీయులు గర్వించదగ్గ విషయం. ఐతే రిషి సునాక్‌ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో భారత సంతతికి చెందిన లీడర్లు ప్రస్తుతం ఆయా దేశాల్లో కీలక బాధ్యతలు చేపడుతున్నారు. వారి గురించి తెలుసుకుందాం..

2 / 10
సింగపూర్ ప్రెసిడెంట్ హలీమా యాకూబ్ భారత సంతతికి చెందినవారు. ఆమె సింగపూర్‌లో జన్మించారు. ఆమె తండ్రి భారతీయుడు, తల్లి మలేషియా వాసి. హలీమా తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఉండేవాడు. ఆమెకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు తండ్రి చనిపోయాడు. హలీమా తన తండ్రి మరణం తర్వాత తన తల్లితో కలిసి సింగపూర్ వీధుల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్ముకుంటూ జీవనం సాగించారు.

3 / 10
పోర్చుగల్ ప్రధాన మంత్రి ఆంటోనియో కాస్టా కూడా భారతీయ సంతతికి చెందినవారే. 61 ఏళ్ల ఆంటోనియో 2015లో పోర్చుగల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆంటోనియా తండ్రి గోవాలో జన్మించారు.

4 / 10
మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింద్ జుగ్నాథ్ కూడా భారతీయ సంతతికి చెందినవారే. జుగ్నాథ్ హిందూ అహిర్ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి భారతీయుడు. బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం అభ్యసించిన జుగ్నాథ్, 2017లో మారిషస్ ప్రధాన మంత్రి అయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రవింద్ జుగ్నాథ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని మూడు రోజుల పాటు సందర్శించారు.

5 / 10
మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్ కూడా భారతీయ సంతతికి చెందిన వారే. రూపన్ 2019 నుంచి మారిషస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. భారతీయ ఆర్యసమాజ్ హిందూ కుటుంబానికి చెందిన వారు.

6 / 10
సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికా ప్రసాద్ అలియాస్ చాన్ సంతోఖి భారతీయ సంతతికి చెందినవారు. పోలీసు అధికారి అయిన చంద్రికా ప్రసాద్ రాజకీయ నాయకుడిగా మారారు. 63 ఏళ్ల చంద్రికా ప్రసాద్ 3 ఫిబ్రవరి 1959న ఇండో-సున్నీ హిందూ కుటుంబంలో జన్మించారు. చంద్రికా ప్రసాద్ తాతను 9వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటీష్ వారు బీహార్ నుంచి సురినామ్‌కు కార్మికుడిగా తీసుకెళ్లారు.

7 / 10
గయానా ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ కూడా భారతీయ సంతతికి చెందినవారే. 8 మిలియన్ల గయానా జనాభాలో దాదాపు సగం మంది భారతీయ సంతతికి చెందిన వారు కావడం విశేషం. అలీ 25 ఏప్రిల్ 1980న గయానాలో ఇండో-గినియన్ ముస్లిం కుటుంబంలో జన్మించారు.

8 / 10
సీషెల్స్ ప్రెసిడెంట్ రాంఖేల్వాన్ కూడా భారతీయ సంతతికి చెందినవాడు. రాంఖేల్వాన్ తాత బీహార్ నివాసి. రాంఖేల్వాన్ తండ్రి మెటల్ వర్కర్‌, తల్లి టీచర్‌.

9 / 10
కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్. డెమోక్రటిక్ పార్టీ నుంచి వచ్చిన కమల అమెరికా చరిత్రలో వైస్ ప్రెసిడెంట్ అయిన మొదటి మహిళ, భారతీయ సంతతికి చెందిన మహిళగా ఘనతకెక్కారు. 57 ఏళ్ల కమలా హారిస్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడులో జన్మించారు. కమల తండ్రి జమైకన్-అమెరికన్ సంతతికి చెందిన డోనాల్డ్ జె. హారిస్.

10 / 10
భారత సంతతికి చెందిన భరత్ జగదేవ్ 2020 నుంచి గయానా వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నానరు. గతంలో 1997 నుంచి 1999 వరకు గయానా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. భరత్ జగదేవ్ భారతీయ హిందూ కుటుంబానికి చెందినవారు. జన్మించాడు. జగ్‌దేవ్ తాత రాజ్ జియావాన్‌ను 1912లో బ్రిటిష్ వారు ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా నుంచి కార్మికుడిగా గయానాకు తీసుకెళ్లారు.