రెండు నిముషాల్లో కడుపును శుభ్రపరచి బాడీని కూల్ చేసే ఈ వడలు తింటే.. ఇమ్యూనిటీ పవర్ కూడా..

Updated on: Apr 25, 2026 | 7:30 AM

Quick healthy snacks recipes Indian: ఎండల్లో మీ కడుపును రెండు నిముషాల్లో క్లీన్ చేసి బాడీని కూల్ చేసే ఈ వడలు తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
బొబ్బర్ల వడలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు బొబ్బర్లు లేదా అలసందలు,  రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క,  నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర,  రుచికి తగినంత ఉప్పు, నూనెను తీసుకోవాలి.

2 / 5
బొబ్బర్లు వడల తయారీ విధానం : ముందుగా బొబ్బర్లను ఇలా నానబెట్టుకోవాలి : బొబ్బర్లను తీసుకుని కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అ తర్వాత ఈ నానిన బొబ్బర్లను తీసుకుని మిక్సీలో కానీ, రోటిలో కానీ వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని మరి జోరుగా కలపకండి. కొద్దిగా నీరు పోసి మళ్ళీ రెండో సారి కూడా మిక్సీ పట్టుకోండి..

3 / 5
ఈ మిశ్రమాన్ని ఇలా తిప్పుకోవాలి  :  ఈ పేస్ట్‌ మిశ్రమం తీసుకుని దానిలో కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం,  నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసి వీటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే బొబ్బర్ల వడలు మంచిగా వస్తాయి తినడానికి కూడా రుచిగా ఉంటాయి.

4 / 5
ఈ వడలను నూనెలో బాగా వేయించుకోవాలి: ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఈ పిండిని వేసుకుని, చేతులకు నీరు రాసుకుని చిన్న గారెలు మాదిరిగా వీటిని వేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక  మీడియం మంటపై గారెలను ఉంచి గోల్డ్ రంగులోకి మారే వరకు వీటిని బాగా వేయించాలి.

5 / 5
ఈ పిండిని మరి జోరుగా చేయకండి అలా చేస్తే గారెలు కరకరలాడవు. మీరు పిండి కొంచెం గట్టిగానే ఉంచాలి. అలాగే, నూనెను మరి కాగనివ్వకండి. అలా చేస్తే బయట కాలి మాడిపోతాయి అలాగే, లోపల కూడా ఉడకవు. కాబట్టి, మీడియం మంట మీదే వీటిని వేయించుకోవాలి. మీకు ఆరోగ్యకరంగాతినాలంటే తక్కువ నూనెలో కాల్చాలి

Follow Us