
ఒక్కోసారి కొందరికి విపరీత వేడి చేస్తుంది ఆ సమయంలో కడుపును చల్లబరిచే ఫుడ్స్ ను తీసుకోవాలి. రెండు నిముషాల్లో క్లీన్ చేసి బాడీని కూల్ చేసే ఈ గారెలు తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

బొబ్బర్ల గారెలు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు బొబ్బర్లు, రెండు చిన్న ఉల్లిపాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి , కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 5 కరివేపాకు ఆకులు, అర కట్ట తరిగిన కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ను తీసుకోవాలి. వీటిని తింటే వేడి తగ్గుతుంది.

బొబ్బర్ల గారెల తయారీ విధానం : ముందుగా బొబ్బర్లను తీసుకుని వాటిని రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అ తర్వాత వీటిని తీసుకుని మిక్సీలో కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. మిక్సీ లేని వాళ్లు రోటిలో కూడా కచ్చా పచ్చగా రుబ్బితే సరిపోతోంది అయితే, దీనిని కొంచం గట్టిగా చేసుకుంటే సరిపోతుంది

బొబ్బర్ల గారెల తయారీ విధానం స్టెప్ 1 : ఈ పిండి ముందుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఆకులు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , ఇంకా ఉప్పును కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే బొబ్బర్ల గారెలు తినడానికి టేస్టీగా ఉంటాయి.

బొబ్బర్ల గారెల తయారీ విధానం స్టెప్ 2 : ఇప్పుడు ఒక పాన్ పెట్టి నూనె వేసి ఈ పిండిని చిన్న గారెల్లాగా చేసుకోవాలి. ఆ తర్వాత నూనెలో వేసి మంటపై ఈ గారెలను రంగు మారే వరకు ఎర్రగా వేయించాలి. ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా వీటిని కాల్చుకోవాలి. అంతే వేడి వేడి బొబ్బర్ల గారెలు రెడీ. పుదీనా చట్నీ లేదా మిర్చి చట్నీతో తింటే అదిరిపోతోంది.