
అరటిపండు: అరటిపండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ప్రముఖ సైన్స్ జర్నల్ ప్లోస్ వన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువ సమయం శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి అరటిపండు ఒక అద్భుతమైన ఇంధనంగా పనిచేస్తుంది. అరటిపండులో ఉండే పీచుపదార్థం రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూస్తుంది.

అరటిపండు జీర్ణక్రియను కాస్త నెమ్మదింపజేసి, గ్లూకోజ్‌ను క్రమక్రమంగా విడుదల చేయడం వల్ల శరీరానికి స్థిరమైన, ఎక్కువసేపు ఉండే శక్తి లభిస్తుంది. అరటిపండు గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా మోడరేట్‌గా ఉంటుంది. కాబట్టి ఉదయం తిన్న తర్వాత మళ్లీ మధ్యాహ్నం భోజనం వరకు ఆకలి వేయకుండా, నీరసం రాకుండా ఉండాలంటే అరటిపండు బెస్ట్ ఛాయిస్.

నారింజ: నారింజ పండ్లలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.. కానీ, నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో దాదాపు 85-87శాతం వరకు నీరే ఉంటుంది. ఇది ఉదయాన్నే శరీరానికి కావలసిన హైడ్రేషన్‌ను అందించి, అలసటను దూరం చేస్తుంది మరియు మిమ్మల్ని మరింత అలర్ట్‌గా ఉంచుతుంది. పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ పరిశోధనల ప్రకారం.. నారింజను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ బ్యాలెన్స్, డైటరీ ప్యాటర్న్స్ మెరుగ్గా ఉంటాయి. ఇవి చాలా తేలికగా, వేగంగా జీర్ణమవుతాయి. కాబట్టి ఉదయాన్నే ఎక్కువ ఆకలి లేని వారికి, లైట్ ఎనర్జీ బూస్ట్ కావాలనుకునే వారికి నారింజ పండు చాలా మంచిది.

ఎలక్ట్రోలైట్స్ - పోషకాల పాత్ర: అరటిపండులో పొటాషియం అత్యధికంగా ఉంటుంది. ఇది కండరాల పనితీరుకు, ఎనర్జీ మెటబాలిజానికి ఎంతో అవసరమైన ముఖ్యమైన ఖనిజం. ఇక నారింజలో విటమిన్ సి, వాటర్ కంటెంట్ ఎక్కువ. ఇది డీహైడ్రేషన్ వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది. మొత్తంగా చూస్తే.. ఒకటి శరీరానికి కావలసిన ఇంధనాన్ని ఇస్తే, మరొకటి బాడీ ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్‌ను కాపాడుతుంది.

మీ బ్రేక్‌ఫాస్ట్‌కు ఏది సెట్ బెస్ట్?: మీకు ఎక్కువ సమయం పాటు ఎనర్జీ కావాలన్నా లేదా ఉదయాన్నే ఆఫీస్ పనులతో విపరీతమైన బిజీ షెడ్యూల్ ఉన్నా అరటిపండు బెస్ట్. ఉదయాన్నే హెవీగా కాకుండా తేలికగా, రీఫ్రెషింగ్‌గా, హైడ్రేటింగ్‌గా ఉండాలనుకుంటే నారింజను ఎంచుకోండి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అటు హైడ్రేషన్, ఇటు నిరంతర శక్తి.. రెండు ఒకేసారి అందుతాయి.