Babar Azam: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. టాప్‌ 1 స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్! దిగజారిపోయిన కొహ్లీ ర్యాంక్..

|

Jul 27, 2022 | 8:08 PM

తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తన టెస్టు కెరీర్‌లో టాప్ ర్యాంకింగ్‌ను సాధించాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను అధిగమించి బాబర్ మూడో స్థానానికి..

1 / 5
తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తన టెస్టు కెరీర్‌లో టాప్ ర్యాంకింగ్‌ను సాధించాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను అధిగమించి బాబర్ మూడో స్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ODI, T20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ర్యాంకు, టెస్ట్‌లలో 3వ స్థానంలో ఉన్నాడు.

2 / 5
వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ 20 మంది ఆటగాళ్లను అధిగమించి వన్డే ర్యాంకింగ్స్‌లో 54వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం ఎగబాకి, 13వ ర్యాంకుకు చేరుకున్నాడు.

3 / 5
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడకపోవడంతో.. వారి ర్యాంకింగ్‌లపై ప్రభావం పడింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒక్కో స్థానం దిగజారడంతో.. వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ 6వ, విరాట్ ఐదో స్థానానికి పరిమితమయ్యారు.

4 / 5
ఇక టెస్టు ర్యాంకింగ్స్‌లో బౌలర్లలో.. జో రూట్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. షహీన్ అఫ్రిది జస్ప్రీత్ బుమ్రాను అధిగమించి మూడో ర్యాంక్‌ సాధించగా, బుమ్రా నాలుగో ర్యాంకు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా జడేజా నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతున్నాడు.

5 / 5
వన్డే ర్యాంకింగ్స్‌లో ట్రెంట్ బౌల్ట్ నంబర్ 1 స్థానంలోనూ, జస్ప్రీత్ బుమ్రా 2వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. షకీబ్ అల్ హసన్ వన్డే ఆల్ రౌండర్ నంబర్ 1గా కొనసాగుతున్నాడు. T20 ర్యాంకింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్ నంబర్ 1 బౌలర్, భువనేశ్వర్ కుమార్ మాత్రమే టీమిండియా తరపున టాప్ 1లో ఉన్నాడు. అతను 8వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.