అయ్యప్ప స్వామి నైవేద్యానికి పులిహోర.. 500 మందికి సరిపడా రెసిపీ.. పక్కా కొలతలు ఇవే!

Updated on: Nov 28, 2026 | 2:06 PM

అయ్యప్ప స్వామి పూజలు, ఇరుముడి కార్యక్రమాల్లో పులిహోర ఎంతో ప్రత్యేకమైన ప్రసాదం. 500 మంది భక్తులకు సరిపడా కమ్మని పులిహోర తయారు చేయాలంటే బియ్యం, చింతపండు, నూనె, పల్లీలు కొలతలు కరెక్ట్ గా ఉండాలి. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

1 / 5
 25 కేజీల బియ్యం, 4 కేజీల చింతపండు, 3 కేజీల పల్లీలు, 3 కేజీల శనగపప్పు, 2 కేజీ మినప్పప్పు, 1 కేజీ ఆవాలు, 3 కేజీల పచ్చిమిర్చి, 3 కేజీల నూనె, అర కేజీ ఎండుమిర్చి, పావుకిలో పసుపు, 200 గ్రాముల ఇంగువ, ఉప్పు, 2 కేజీల కరివేపాకు రెడీ చేసుకోవాలి. 
 ఇలా చేస్తే 500 మందికి పెట్టొచ్చు.  ఎలా చేయాలంటే?

25 కేజీల బియ్యం, 4 కేజీల చింతపండు, 3 కేజీల పల్లీలు, 3 కేజీల శనగపప్పు, 2 కేజీ మినప్పప్పు, 1 కేజీ ఆవాలు, 3 కేజీల పచ్చిమిర్చి, 3 కేజీల నూనె, అర కేజీ ఎండుమిర్చి, పావుకిలో పసుపు, 200 గ్రాముల ఇంగువ, ఉప్పు, 2 కేజీల కరివేపాకు రెడీ చేసుకోవాలి. ఇలా చేస్తే 500 మందికి పెట్టొచ్చు. ఎలా చేయాలంటే?

2 / 5
 ముందుగా బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టండి. ఆ తరువాత, తగినంత ఎసరు కొద్దిగా సాల్ట్, కొద్దిగా నూనె వేసి పొడిపొడిగా ఉడికించుకోండి. అన్నం ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసి చల్లారనివ్వండి. ఇప్పుడు చింతపండును తీసుకుని, కొద్దిగా వేడి నీటిలో అరగంట పాటు నానబెట్టండి. బాగా నానిన చింతపండు నుంచి చిక్కటి గుజ్జును తీసుకోండి. మిగిలిన పిప్పిని పడేయకుండా రసం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.

3 / 5

ఒక కడాయిలో నూనె వేసి, పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత చింతపండు గుజ్జు, రుచికి సరిపడా ఉప్పు,  పసుపు వేయాలి. చింతపండు గుజ్జు దగ్గరపడి, నూనె పైకి తేలే వరకు ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించి, చల్లారనివ్వండి.
వేరొక పాన్‌లో  మెంతులు, ఆవాలు,  జీలకర్ర, వేసి తక్కువ మంటపై దోరగా వేయించండి.

ఒక కడాయిలో నూనె వేసి, పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత చింతపండు గుజ్జు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేయాలి. చింతపండు గుజ్జు దగ్గరపడి, నూనె పైకి తేలే వరకు ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించి, చల్లారనివ్వండి. వేరొక పాన్‌లో మెంతులు, ఆవాలు, జీలకర్ర, వేసి తక్కువ మంటపై దోరగా వేయించండి.

4 / 5
మెంతులు రంగు మారగానే  నువ్వులు వేసి ఒక్క నిమిషం పాటు వేయించి స్టవ్ ఆపివేయండి. చల్లారిన తర్వాత వీటిని రోట్లో మిక్సీలో మెత్తటి పొడిలా చేసుకోవాలి. మరొక గిన్నెలో నూనె వేసి, వేరుశనగ గుళ్ళు,  పచ్చిశనగపప్పు,  మినప్పప్పు,  జీలకర్ర,  ఆవాలు వేసి రెండు నిమిషాల పాటు తక్కువ మంటపై వేయించండి.

5 / 5
తాలింపు వేగిన తర్వాత,  ఎండుమిర్చి,  కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించి,  ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆపివేయండి. చల్లారిన అన్నంలో ఉడికించిన చింతపండు గుజ్జు వేసి బాగా కలపండి. తరువాత, మనం తయారు చేసుకున్నఅన్నంలో  తాలింపును వేసి అన్నం అంతా కలిసేలా నెమ్మదిగా కలపండి. రుచి చూసి, అవసరమైతే ఉప్పు కలుపుకోవచ్చు

Loading...
Unable to load recommendations.
Follow Us