
తులసి మొక్క: హిందూ మతంలో తులసిని చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. దీనిని ఇంటి ప్రాంగణంలో, బాల్కనీలో లేదా కిటికీ దగ్గర పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. అంతే కాదు ఇది ఆరోగ్యం పరంగా కూడా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర పూజ చేసి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, సంపద పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మనీ ప్లాంట్: మనీ ప్లాంట్‌ను శ్రేయస్సు, ఆర్థిక వృద్ధికి చిహ్నంగా భావిస్తారు. వాస్తు ప్రకారం, దీనిని ఇంటి లోపల, ముఖ్యంగా ఆగ్నేయ దిశలో ఉంచడం ఎంతో మంచిది.ఈ మొక్క సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుందని నిపుణులు అంటున్నారు. దీని ప్రత్యేక లక్షణం ఏమిటంటే దీనిని పెంచడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు.

స్నేక్ ప్లాంట్: ఇవి చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే దీని పొడవైన, నిటారుగా ఉండే ఆకులు ఇంటికి ఎంతో అందగాన్ని తెచ్చి పెడుతాయి. ఈ మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని తగ్గిస్తాయి. అలాగే ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతాయి.

స్పైడర్ ప్లాంట్: ఈ మొక్క కూడా ఇంటి అందాన్ని పెంచుతుందిజ. వీటిని ఇంటి బాల్కనీలో వేలాడే కుండీలలో పెంచడం ద్వారా అది ఇంటికి ఎంతో అందమైన లుక్‌ను ఇస్తుంది. ఈ మొక్క ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వాస్తు ప్రకారం, ఈ మొక్క ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే సంపద సృస్టికి తోల్పడుతుంది

కలాంచో: ఇది ఒక అందమైన పుష్పించే మొక్క, ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా సానుకూల శక్తికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. దీని చిన్న, రంగురంగుల పువ్వులు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వాస్తు ప్రకారం, ఇంట్లో దీన్ని ఉంచడం వల్ల శాంతి, ఆనందం పెంపొందుతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొగిపోతాయి.(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు.)