
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

గ్రహాలన్నింటిలో ఈ కుజ గ్రహం చాలా ముఖ్యం ఎందుకంటే. కష్టా సుఖాలను ఇచ్చేది ఈ గ్రహమే. ఇంకా కుజుడు త్వరలో తన దిశను మార్చుకోబోతున్నాడు. దీనివల్ల రెండు రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది. మరి,ఆలస్యం చేయకుండా ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మిథున రాశి : ఈ రాశివారికి మంచిగా ఉండబోతోంది. ఈ నెల ఏం చేసినా కూడా మొత్తం అద్భుతంగా మారుతుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. చేసే అన్ని పనుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. సవాళ్లు వచ్చిన కూడా అసలు భయపడరు. శక్తి కూడా పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగం కూడా వస్తుంది. పెట్టుబడులు పెట్టిన చోట లాభాలు పొందుతారు

తులా రాశి : ఈ రాశివారికి అనుకూలంగా మారుతుంది. రెండు నెలల ఆడిందే ఆటలా ఉండబోతోంది. కొత్తగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఇవి మీకు కలిసొచ్చె ప్రయాణాలే. ఇంకా వ్యాపారాల్లో భారీగా లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి. మీ పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. మీ కుటుంబ సమయం గడుపుతారు

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.