
చాలా మందికి వాతావరణంలో మార్పులు వచ్చిన ప్రతి సారి ఆస్తమా, జలుబు సమస్యలు ఎక్కువవుతాయి అయితే, దీని వలన శ్వాసకోశ సమస్యలు బయటపడతాయి అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే నేచురల్ చిట్కాలను ఫాలో అవ్వడమే. మరి అస్సలు, అసలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఆస్తమా శ్వాససంబంధ సమస్య అయితే గాలి పీల్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారికి ఊపిరితిత్తుల్లో కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి పీల్చడానికి కూడా ఆటంకం కలుగుతుంది.అలాంటి వాళ్ళు ఈ నేచురల్ చిట్కాతో దానికి చెక్ పెట్టేయండి.

ముందుగా గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి 6 లవంగాలు, కొద్దిగా మిరియాలు, అల్లం ముక్క, తులసి ఆకులు కూడా దీనిలో బాగా మరిగించి వాటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఆస్తమా బాగా ఉంటే రోజులో 2 సార్లు తీసుకోవాలి నార్మల్ గా ఉంటే ఒకసారి తాగితే సరిపోతోంది.ఈ డ్రింక్ ఆస్తమా నుండి పూర్తీ రిలీఫ్ ను ఇస్తుంది.

ఇది పాతకాలం నుంచి పాటిస్తున్నారు మన తాతలు ఆస్తమాతో ఇబ్బంది పడిన ప్రతి సారి ఇలాగే చేసే వాళ్ళు. అయితే మీరు చేసుకునే టప్పుడు దానిలో మరి ఎక్కువగా వేయకండి, మితంగానే వేసుకుని తీసుకోవాలి లేదంటే ఘాటు వలన గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, మూడు సార్లకి మించి దీనిని తీసుకోకండి.

మిరియాలు, అల్లం కూడా దీనిలో వేస్తాం కాబట్టి మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)