Apple: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తొలిసారి టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో.. ఫీచర్లు చూస్తే..

Updated on: Oct 29, 2026 | 8:21 AM

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ల్యాప్‌టాప్ ఫీచర్ల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం నార్మల్‌ ల్యాప్‌టాప్‌లనే మార్కెట్‌లోకి తొచ్చే యాపిల్ తొలిసారిగా టచ్‌స్క్రీన్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రోను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.ఈ కొత్త మ్యాక్‌బుక్ ప్రోలో OLED డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ సపోర్ట్‌తో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్‌ ఏంటీ.. ఈ మ్యాక్‌బుక్‌ ప్రో ధర ఎంతో చూద్దాం పదండి.

1 / 5
తన ల్యాప్‌టాప్‌ల విషయంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు టచ్‌స్క్రీన్‌తో డిస్‌ప్లేలకు దూరంగా ఉన్న యాపిల్.. తొలిసారిగా టచ్‌స్క్రీన్‌తో కూడిన మ్యాక్‌బుక్‌ ప్రోను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రీసెంట్‌గాని భారత్‌ మార్కెట్‌లోకి తెచ్చిన ఈ మ్యాక్‌ బుక్‌ ప్రో ధరలను యాపిల్ ప్రకటించింది. భారత మార్కెట్లో 14 అంగుళాల మోడల్ ధర రూ.3,49,900గా ఉండగా, 16 ఇంచెస్ వేరియంట్ ధర రూ.4,09,900గా నిర్ణయించింది. ఈ ల్యాప్‌టాప్‌లు నవంబర్ 9 నుంచి సేల్స్‌కు రానున్నాయి.

2 / 5
కొత్తగా అప్‌డేట్ చేసిన మ్యాక్‌బుక్ ప్రోలో యాపిల్ అనేక మార్పులు చేసింది. అందులో మెయిన్‌ ప్లస్ పాయింట్ ఏంటంటే టచ్‌స్క్రీన్ ఆప్షన్‌ను తీసుకురావడం. ఇక దీన్ని అచ్చం మన ట్యాబ్‌ తరహాలో వాడుకోవచ్చు. ప్రొఫెషనల్స్‌కు ఈ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. డిజైనర్లు 3D మోడళ్లతో నేరుగా పనిచేయడంతో పాటు, మ్యూజిక్ ప్రొడ్యూసర్లు స్క్రీన్‌పై వేళ్లతోనే వివిధ ఆడియో కంట్రోల్స్‌ను సెట్‌ చేసుకోవచ్చు. అలాగే ఈ కొత్త మ్యాక్‌బుక్ ప్రోలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ డైనమిక్ ఐలాండ్. ఇన్నాళ్లు కేవలం ఐఫోన్లకే పరిమితమైన ఈ ఫీచర్ ఇప్పుడు మ్యాక్ కంప్యూటర్‌లోకి తీసుకొచ్చింది.

3 / 5
కొత్త మ్యాక్‌బుక్ ప్రోలో టాండమ్ OLED డిస్‌ప్లేతో పాటు ప్రోమోషన్ టెక్నాలజీతో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. HDR కంటెంట్‌ను చూసే వారు 2,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను పెంచుకోవచ్చు. దీనికి మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే వీటిలో M5 Pro, M5 Max చిప్‌సెట్లను వాడారు. వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అన్నింటి ఇది ఈజీగా హ్యండిల్ చేస్తుంది.

4 / 5
ఈ ప్రాసెసర్లలోని GPU కోర్లలో న్యూరల్ యాక్సిలరేటర్లను అందించినట్లు యాపిల్ తెలిపింది. ఇవి AI సంబంధిత పనులను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడతాయి. స్టోరేజ్ సామర్థ్యం గరిష్ఠంగా 16TB వరకు అందుబాటులో ఉండనుంది. గత మోడళ్లతో పోలిస్తే స్టోరేజ్ వేగం రెండింతల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు దీన్ని 24 గంటల వరకు యూజ్ చేయవచ్చు. అంతేకాదు జస్ట్ 30 మినెట్స్‌లోనే ఇది 50 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. అలా అని దీని బరువు కూడా పెద్దగా ఏమి లేదు.. మునుపటి వాటితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుందని యాపిల్ పేర్కొంది.

5 / 5
 మొత్తంగా చూస్తే.. OLED డిస్‌ప్లే, M5 Pro, M5 Max ప్రాసెసర్లు, టచ్‌స్క్రీన్, డైనమిక్ ఐలాండ్ వంటి ఫీచర్లతో కొత్త మ్యాక్‌బుక్ ప్రోను యాపిల్ మరింత శక్తివంతమైన ప్రొఫెషనల్ ల్యాప్‌టాప్‌గా తీర్చిదిద్దింది. అయితే భారత మార్కెట్లో రూ.3.49 లక్షల నుంచి ప్రారంభమయ్యే ధర కారణంగా ఇది ప్రధానంగా ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్స్‌కు, ఎక్కువ ఏఐ వాడే వారే తీసుకునే ఛాన్స్ ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us