
ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల తర్వాత అర్ధసెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ. దీంతో అతని భార్య అనుష్కా శర్మ ఆనందానికి ఆకాశమే హద్దైంది.

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 57 పరుగులు చేశాడు విరాట్. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవకపోయినా.. చాలా రోజుల తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు.

బ్యాటింగ్‌లో వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న కింగ్ కోహ్లీ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.

కాగా నేడు (మే1) అనుష్క పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్న రాత్రి తన భార్యకు సర్‌ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడట కోహ్లీ. కాగా ఆర్సీబీ- గుజరాత్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో కింగ్ కోహ్లీ పోస్టర్లు ట్రెండింగ్‌లో నిలిచాయి

కాగా క్రికెట్‌లో 60 రోజుల తర్వాత రన్ మెషీన్ కోహ్లి మళ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. చివరిసారిగా వెస్టిండీస్‌తో ఈడెన్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అతను అర్ధ సెంచరీ మార్కును అందుకున్నాడు.

నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా గ్యాలరీలో సందడి చేస్తోన్న అనుష్క ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలిచాయి.