కమ్మటి ఉల్లిపాయ పచ్చడి.. ఇలా చేసి ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ మర్చిపోలేరు!

Updated on: Aug 06, 2026 | 8:07 PM

ఉల్లిపాయ పచ్చడిది ఒక ప్రత్యేకమైన రుచి. అన్నంలోకి, ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్‌లలోకి ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లో ఇతర కూరగాయలు అందుబాటులో లేనప్పుడు, కేవలం ఉల్లిపాయలతో ఈ పచ్చడిని తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. దీని ప్రత్యేకమైన రుచిని ఒకసారి రుచి చూస్తే, తప్పకుండా మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది..

1 / 5
ఉల్లిపాయ పచ్చడిది ఒక ప్రత్యేకమైన రుచి. అన్నంలోకి, ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్‌లలోకి ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లో ఇతర కూరగాయలు అందుబాటులో లేనప్పుడు, కేవలం ఉల్లిపాయలతో ఈ పచ్చడిని తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. దీని ప్రత్యేకమైన రుచిని ఒకసారి రుచి చూస్తే, తప్పకుండా మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది.

2 / 5
తయారీకి కావలసినవి.. పెద్ద ఉల్లిపాయలు 3, మీడియం సైజు టమాటా 1, ఆవాలు 1/2 టీస్పూన్ (పోపులో అదనంగా 1 టీస్పూన్), మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టీస్పూన్ (పోపులో అదనంగా 1 టీస్పూన్), ఎండుమిరపకాయలు 20-25 (కారం బట్టి సర్దుబాటు చేసుకోవచ్చు), చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, నూనె 2-3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 4 (దంచినవి, పోపు కోసం), కరివేపాకు ఒక రెమ్మ (పోపు కోసం), శనగపప్పు, మినపప్పు (పోపు కోసం, అన్నీ కలిపి 1 టీస్పూన్) చొప్పున తీసుకోవాలి.

3 / 5
ముందుగా.. పెద్ద ఉల్లిపాయలు మూడు, ఒక మీడియం సైజు టమాటా తీసుకుని శుభ్రం చేసుకోవాలి. వీటిని మధ్యస్థ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఒక్క టీస్పూన్ నూనె వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత, 1/2 టీస్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు (ఎక్కువ వేస్తే పచ్చడి చేదు అవుతుంది), 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి లైట్‌గా వేగనివ్వాలి. ఆ తర్వాత, 20-25 ఎండుమిరపకాయలను తుంచి బాండీలో వేయాలి. ఎండుమిర్చిని తుంచి వేయడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగి, పచ్చడికి రుచి వస్తుంది. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి పరిమాణాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. కావాలనుకుంటే కొద్దిగా ధనియాలు కూడా వేసి వేయించుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
అదే బాండీలో ఒకటి లేదా రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, లో లేదా మీడియం ఫ్లేమ్‌లో ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంతవరకు ఒకటి, రెండు నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయలు రెండు నిమిషాలు వేగిన తర్వాత, కట్ చేసిన టమాటా ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండును విడదీసి వేయాలి. ఫ్లేమ్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడే వరకు, అంటే సుమారు నాలుగు, ఐదు నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు సరిగ్గా వేగకపోతే పచ్చడి రుచిగా ఉండదు. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని, ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చల్లారిన ఉల్లిపాయ, టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి, పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్టులా గ్రైండ్ చేయకూడదు. రైస్‌లో కలుపుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్న పలుకులుగా తగులుతూ ఉంటేనే రుచి బాగుంటుంది.

5 / 5
పచ్చడి సిద్ధం చేసుకున్న తర్వాత పోపు కోసం మళ్ళీ అదే బాండీలో ఒక టేబుల్‌స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు (అన్ని కలిపి ఒక టీస్పూన్) వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించాలి. ఆవాలు వేగిన తర్వాత, దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు ఎండుమిర్చిని తుంచి, ఒక రెమ్మ కరివేపాకు వేసి పోపు వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత, సిద్ధం చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని పోపులో వేసి, స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్‌లలోకి కూడా ఇది సరైన కాంబినేషన్. ఈ సింపుల్, రుచికరమైన పచ్చడిని మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us