
పచ్చి ఉల్లి కారం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని ఉల్లిపాయ, పచ్చి కారంతో చేస్తారు. చలిగా ఉన్నప్పుడు దీనిని బాగా తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి కొందరు దీనిని రోటిల్లోకి తింటారు. దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :3 పెద్ద ఉల్లిపాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, రెండు టేబుల్ స్పూన్స్ ఎర్ర కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా దీనిలో పులుపు కోసం నిమ్మరసం లేదా చింతపండు ముక్క, కట్ చేసిన కొత్తిమీర, తగినంత ఆయిల్ ను తీసుకోవాలి. అయితే, కొంచం కారం ఎక్కువగా తీసుకుంటే చేస్తే టేస్టీగా ఉంటుంది.

తయారి విధానం : ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి దీని మీద ఒక మీడియం సైజ్ పాన్ పెట్టి, దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో అర టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి, ఆ తర్వాత కొద్దిగా అర టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇంకా కొంచం మినప్పప్పును కూడా వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు దీనిని మూడు నిముషాల పాటు వేయించుకోవాలి.

పచ్చి ఉల్లిపాయ కారం స్టెప్ 1 : తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకుని దానిలో లైట్ గా ఆయిల్ లో వేసి వాటిని వేయించుకోవాలి. ఇంకా వీటితో పాటు అర టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిర్చి ముక్కలు కూడా వేసి మీడియం మంటపై వేయించుకోవాలి. కరివేపాకు ఆకులు వేసి కరకరలాడే వరకు ఉంచుకోవాలి.

దీనిని కిందకి దించి కొద్దిగా చల్లారిన తర్వాత దీనిని మంచిగా మిక్సీ పట్టుకుని కొంచం పొడిలాగా చేసుకోవాలి. ఇంకా చివర్లో 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా కాకుండా పొడిలాగా పట్టుకోవాలి. నిమ్మరసం కూడా వేసి వాటిని కలపండి. పచ్చి ఉల్లిపాయను ఎక్కువసేపు ఉంచితే నీరు బయటకు వచ్చి, ఘాటు తగ్గుతుంది అంత సేపు ఉంచకండి