అమ్మ చేతి రుచిని గుర్తు చేసే ములక్కాడ పచ్చిరొయ్యల కూర.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాల్సిందే!

Updated on: Oct 01, 2026 | 12:23 PM

ఆంధ్రా వంటకాల్లో పచ్చిరొయ్యల కూరకు ప్రత్యేక స్థానం ఉంది. పచ్చిరొయ్యలను ఎన్నో రకాలుగా వండుతారు. వాటిలో ములక్కాయల కలయికతో చేసే ములక్కాడ పచ్చిరొయ్యల కూర ఎంతో రుచికరమైనది. మరి అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

కావలసిన పదార్థాలు: పచ్చిరొయ్యలు: 1 కిలో,  ములక్కాయలు: 2,  మంచి నూనె: 100 గ్రాములు,  కారం: 2.5 చెంచాలు,  పసుపు: అర చెంచా, ఉప్పు: 2 చెంచాలు (లేదా రుచికి సరిపడా),  చింతపండు: 50 గ్రాములు, పెద్ద ఉల్లిపాయలు: 1 పెద్దది (ముక్కలు), 2 చిన్నవి (మసాలాకు) పచ్చిమిరపకాయలు: 8,  కొత్తిమీర: కొద్దిగా, కరివేపాకు: కొద్దిగా తీసుకోవాలి.

3 / 5
ముందుగా కిలో పచ్చిరొయ్యలను శుభ్రం చేసుకోవాలి. ఒక చెంచా ఉప్పు, అరచెంచా పసుపు, కొద్దిగా మజ్జిగ కలిపి రొయ్యలను బాగా పిసికి కడగాలి. ఇలా చేయడం వల్ల రొయ్యలకున్న నీచు వాసన తగ్గుతుంది. పై మసాలా కోసం: ధనియాలు, లవంగాలు, దాల్చినచెక్క, చిన్న ఉల్లిపాయ రెబ్బలను మెత్తగా నూరాలి. గసగసాలు, అల్లం, కొబ్బరిని వేరువేరుగా నూరి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ఈ మసాలాలను రోట్లో నూరడం వల్ల కూరకు మరింత రుచి వస్తుంది.

4 / 5
శుభ్రం చేసుకున్న రొయ్యలను పొయ్యి మీద పెట్టి, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టి, రొయ్యల నుండి నీరు వచ్చి, అవి కొద్దిగా ఉడికే వరకు ఉడికించి, ఆ నీళ్లను వంపేయాలి. ఇది కూర రుచికి చాలా ముఖ్యం. ఒక గిన్నెను వేడి చేసి, 100 గ్రాముల మంచి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపు, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.

5 / 5
ములక్కాయ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న రొయ్యల ముక్కలు వేసి బాగా కలిపి, ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి.
మూత తీసి, 2.5 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు వేసి కలిపి, ముందుగా నానబెట్టి పులుసు తీసుకున్న చింతపండు పులుసు పోసి కలపాలి. తిరిగి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. ఇప్పుడు నూరి పెట్టుకున్న కొబ్బరి, అల్లం, గసగసాల పేస్ట్‌ను కూరలో కలిపి, మరో ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. చివరగా, ముందుగా నూరి పెట్టుకున్న పై మసాలాను వేసి బాగా కలిపి, కొద్దిగా కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.

ములక్కాయ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న రొయ్యల ముక్కలు వేసి బాగా కలిపి, ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. మూత తీసి, 2.5 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు వేసి కలిపి, ముందుగా నానబెట్టి పులుసు తీసుకున్న చింతపండు పులుసు పోసి కలపాలి. తిరిగి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. ఇప్పుడు నూరి పెట్టుకున్న కొబ్బరి, అల్లం, గసగసాల పేస్ట్‌ను కూరలో కలిపి, మరో ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. చివరగా, ముందుగా నూరి పెట్టుకున్న పై మసాలాను వేసి బాగా కలిపి, కొద్దిగా కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us