
గోంగూర తాలింపు కూరను చేసుకుని వేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు దీనిని లాగిస్తారు. అంత కారం, పుల్లగా రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం హాస్పిటల్స్‌కి వేలకి వేలు పెట్టకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

గోంగూర తాలింపు కూరకు కావాల్సిన పదార్దాలు: ఒక కట్ట గోంగూర, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, సరిపడా టేస్టింగ్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, పోపు గింజలు , రుచికి తగినంత ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , కొద్దిగా ఆవాలు, కరివేపాకును తీసుకోవాలి.

గోంగూర తాలింపు తయారీ విధానం : ముందుగా గోంగూర ఆకులను తీసుకుని కడిగి వీటిని పూర్తిగా ఆరనివ్వాలి. అలాగే, ఒక పాన్‌లో గోంగూరను కూడా వేసి నీరు లేకుండా 10 నిమిషాలు పాటు దీనిని వేయించాలి. ఆ ఆకులు మెత్తబడ్డాక వాటిని బాగా చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారిన తరవాత ఈ గోంగూరను తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా లేదా కొద్దిగా మెత్తగా రుబ్బుకోవాలి.

గోంగూర తాలింపు తయారీ విధానం స్టెప్ - 1: ఇంకా ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇంకా కొద్దిగా శనగపప్పు కూడా దీనిలో వేయాలి. అవి బాగా వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి, రెండు కరివేపాకు ఆకులు, మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని బాగా వేయించాలి.

ఇక ఇప్పుడు, కట్ చేసిన ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి కూడా వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించలి. ఇంకా దీనిలో కొద్దిగా పసుపు, ఇంకా కారం కూడా వేసి గోంగూర ముద్దను దీనిలో కలపాలి. ఇంకా దీనిలో ఉప్పు వేసి 10 నిమిషాలు పాటు ఉంచి మీడియం మంటపై కలుపుతూ ఉడికించాలి.