
పండుగలు, ఇంకా వ్రతాలు చేసుకునేటప్పుడు కొందరు ఉల్లిపాయ, ఇంకా వెల్లుల్లి లేకుండా తినే వంటకాలే అవసరం. ఇలాంటి సమయాల్లో అల్లం మిరియాల వంకాయ కూర మంచి ఆప్షన్. ఇంకా దీనిని ఆంధ్రాలో ఎంతో మంది ఫేవరేట్ కూడా. ఫ్రెష్ అల్లం, మిరియాల వంకాయలతో చేసే ఈ కూర జలుబు, దగ్గును తగ్గిస్తుంది.

అర కిలో వంకాయలు, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం, 3 టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఎండు మిర్చి 2 ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చిటికెడు పసుపు, 10 కరివేపాకు ఆకులు , 2 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడా, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.

అల్లాన్ని తీసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి, దీనిని రోటిలో వేసి మెత్తగా దంచుకోవాలి. ఇంకా మిక్సీలో కంటే రోటిలో దంచితే మంచి రుచి వస్తుంది. అలాగే వంకాయలను కూడా బాగా కడిగి, ఉప్పు నీళ్లలో ఉంచితే రంగు మారకుండా ఉంటుంది. ఇంకా పాన్ లో నూనె వేసి అది వేడయ్యాక ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించండి. ఇలా చేయడం వలన మంచి రుచి వస్తుంది.

ఆ తర్వాత దీనిలో పచ్చి శనగపప్పు వేసి వేగనివ్వండి. ఇంకా కొద్దిగా జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఆకులు వేసి మంచిగా వేగనివ్వాలి. ఇక ఇప్పుడు దీనిలో దంచిన అల్లం ఇంకా ముద్దను కూడా వేసి రెండు-మూడు నిమిషాల పాటు వేయిచుకోవాలి. ఇక ఇప్పుడు దీనిలో అల్లం పచ్చి వాసన పోయాక నాలుగు పచ్చిమిర్చి వేసి కలపండి.

ఇంకా కొద్దిగా ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి కాసేపు వేగనివ్వండి. ఇంకా ఆ తర్వాత నాలుగు వంకాయ ముక్కలు కూడా వేసి మసాలాలు మంచిగా పట్టేలా దీనిలో పెట్టకుండా నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మీడియం మంట పై ఈ వంకాయలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. దించే ముందు కొత్తిమీర చల్లి దించుకోవాలి.