Ulundu Sadam: ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ ఉళుందు సాదం.. ప్రసాదంగా కూడా అద్భుతం

Updated on: Oct 14, 2026 | 6:25 PM

మనం నిత్యం దేవాలయాల్లో లేదా పండుగ దినాల్లో పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలను చూస్తుంటాం. కానీ దక్షిణ భారతంలో, ముఖ్యంగా పాండ్య రాజుల కాలం నుండి వస్తున్న అత్యంత శక్తివంతమైన ప్రాచీన వంటకం ఉళుందు సాదం. తమిళంలో 'ఉళుందు' అంటే మినపప్పు అని అర్థం. ఈ వంటకాన్ని పురాతన కాలం నుండి తమిళనాడు ఆలయాలలో పవిత్ర ప్రసాదంగా నివేదించడమే కాకుండా.. యుక్తవయస్సుకు వచ్చిన ఆడపిల్లల నడుము, వెన్నెముక మరియు తుంటి ఎముకలు ధృడంగా మారడానికి ఔషధ ఆహారంగా చేసి పెట్టేవారు. 

1 / 5
కావలసిన పదార్థాలు: 1 గిన్నె పొట్టు బద్ద మినపప్పు, 1 గిన్నె బియ్యం, 7 గిన్నెల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 2 ఎండు మిరపకాయలు, 8 నుండి 10 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 రెమ్మ కరివేపాకు, పావు టీస్పూన్ ఇంగువ

2 / 5
 తయారీ విధానం: స్టవ్‌పై కడాయి పెట్టి ఒక గిన్నెడు పొట్టు బద్ద మినపప్పును వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో ఆపకుండా కలుపుతూ పచ్చివాసన పోయి, గింజలు మంచి రంగులోకి మారి కమ్మటి సువాసన వచ్చే వరకు దోరగా వేయించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అదే గిన్నెతో ఒక గిన్నెడు బియ్యం తీసుకుని రెండింటినీ కలిపి ఒకసారి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఉడకడానికి సరిపడా 7 గిన్నెల మంచి నీళ్లు పోసి కనీసం 1 గంట పాటు నాననివ్వాలి. మినపప్పు పొట్టుతో ఉంటుంది కాబట్టి చక్కగా నానితేనే లోపలి వరకు మెత్తగా ఉడుకుతుంది.

3 / 5
గంట తర్వాత నానిన పప్పు-బియ్యం గిన్నెను స్టవ్‌పై పెట్టి రుచికి సరిపడా ఉప్పు వేసి మీడియం మంటపై మరిగించాలి. నీరు మరగడం ప్రారంభించగానే మంటను లో ఫ్లేమ్‌కి తగ్గించి, ఆవిరి పోయేలా మూత కొద్దిగా వారుగా పెట్టి దగ్గరపడే వరకు ఉడికించాలి. అన్నం, పప్పు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించుకోవాలి (ఒకవేళ అన్నం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కాచి చల్లార్చిన వేడి నీటిని కొద్దిగా పోసి మరో నిమిషం మగ్గించవచ్చు.

4 / 5
వేరొక చిన్న పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నాణ్యమైన నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కాగిన తర్వాత తుంచిన ఎండుమిర్చి, జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి. జీడిపప్పు రంగు మారుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. చివరగా పావు టీస్పూన్ ఇంగువ చల్లి వెంటనే ఈ ఘుమఘుమలాడే తాలింపును ఉడికించిన అన్నంలో వేసి అంతా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి.

5 / 5
అంతే, నోరూరించే ప్రాచీన రాచరిక వంటకం 'ఉళుందు సాదం' సిద్ధం! దీనిని వేడివేడిగా వడ్డించుకుని, పైనుంచి మరో చెంచా నెయ్యి వేసుకుని తింటుంటే అమృతతుల్యంగా ఉండటమే కాకుండా.. ఏదైనా కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో నంజుకుని తింటే తిరుగులేని రుచితో తృప్తినిస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us