
ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్ లు ఉన్నాయి. ఇది వరకు రోజుల్లో ఫ్రిడ్జ్ ఉన్న ఇల్లు వెతికినా కూడా దిరికేది కాదు కానీ ఇప్పుడు ఇది లేకుండా జీవితం అస్సలు ఊహించలేని పరిస్థితి. పాత కాలంలో కరెంట్ లేకపోయినా మన తాతలు , నానమ్మలు నేచురల్ చిట్కాలతోనే నీళ్లు, ఇంట్లో వండుకున్న ఆహారాలను చల్లగా ఉంచుకునేవారు.

అలాంటి నేచురల్ కూలింగ్ పేదల ఫ్రిడ్జ్ ‘సొరకాయ బుర్ర’ కూడా ఒకటి. ఇప్పటికి ఎన్నో గ్రామాల్లో వీటిని వాడుతున్నారు. అసలు ఈ సొరకాయ బుర్రను ఎలా చేస్తారంటే? పెద్దగా లావుగా గుండ్రంగా ఉన్న సొరకాయను తీసుకుని దానిని ఎండబెట్టి లోపలి గుజ్జు మొత్తాన్ని తీసేస్తే అది ఒక బుర్రలా మారుతుంది. దీనినే సొరకాయ బుర్ర అని పిలుస్తారు.

ఈ బుర్రలో నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయంటే? ఈ సొరకాయ బుర్రలో లోపల మొత్తం చల్లగా ఉంటుంది. ఇంకా దీనిలో పోసిన నీరు సహజంగానే నెమ్మది నెమ్మదిగా చల్లబడుతుంది. అంటే, మట్టికుండల్లాగా.. ఒకసారి నీళ్లు పోస్తే సహజ ప్రక్రియ వలెనే ఇవి కూల్‌గా అవుతాయి. ఇంకా పూర్వకాలంలో రైతులు , కూలీలు ఇంకా ఎంతో మంది దీనిని వాడేవారు

ఇంకా గ్రామాల్లోకి వెళ్ళే రైతులు, ఇంకా పొలాలకు వెళ్లేటప్పుడు ఈ సొరకాయ బుర్రలోనే మంచి నీళ్లు తీసుకెళ్లేవారు. ఇక సమ్మర్లో బాగా వాడేవాళ్లు ఎండల్లో ఎన్ని గంటలు ఉన్నా కూడా నీళ్లు అలాగే చల్లగానే ఉండేవి. ఇంకా కొందరైతే దీనిలో మజ్జిగ, ఇంకా గంజి కూడా దీనిలోనే నిల్వ చేసి తాగేవాళ్ళు. అప్పట్లో ఇవి అంత ఫేమస్

ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి: వీటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సొరకాయ ఉంటే చాలు. ఇంకా ఇవి ఫ్రిడ్జ్‌లో ఉంచిన వాటి కంటే కూడా సహజంగా చల్లబడతాయి. ఈ నీళ్లు శరీరంఓ కూడా తగ్గిస్తాయి అలాగే శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.ఈ నీళ్లు తాగితే గొంతు సమస్యలు, జలుబు సమస్యలు కూడా తగ్గుతాయి .