
an engineering marvel meil construction zojila tunnel Between Jammu Kashmir And Ladakh photos

14.15 కిలోమీటర్ల ఈ జోజిలా టన్నెల్ నిర్మాణ పనులు తెలుగు సంస్థ మేఘా ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు జోజిలా సొరంగ మార్గాన్ని సందర్శిస్తున్నారు.

జోజిలా ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారులతో, మేఘా ప్రతినిధులతో సమీక్షించనున్నారు.

జోజిలా టన్నెల్ జాతీయ భద్రత, సైనిక అవసరాలను తీర్చడానికి, జమ్మూ కాశ్మీర్, లఢఖ్ ప్రాంతాల అభివృద్ధికి, పర్యాటకరంగ అభివృద్దికి దోహదపడనుంది.

ఈ టన్నెల్ లడఖ్ ప్రాంతం- కార్గిల్, లేహ్‌కి ఏడాది పొడవునా రహదారి కనెక్టివిటీని అందించనుంది.

ఈ జోజిలా టన్నెల్ సాధారణ ప్రజలతోపాటు పర్యాటకులకు, భారత సైన్యానికి చాలా ముఖ్యమైనది. ఇది పూర్తయిన తర్వాత అన్ని వాతావరణ పరిస్థితుల్లో లడఖ్ ప్రాంతానికి కశ్మీర్ లోయతో కనెక్టెవిటీ ఉంటుంది.

శ్రీనగర్, కార్గిల్, లేహ్ ప్రాంతాలు రవాణా అనుసంధానంలో ఉంటాయి. జోజిలా టన్నెల్ నిర్మాణంతో.. శ్రీనగర్, ద్రాస్, కార్గిల్, లేహ్ మధ్య రోడ్ మార్గం సులభం అవుతుంది.

ప్రస్తుతం ఈ రహదారి సంవత్సరంలో 6 నెలలపాటు మూసివేయబడుతుంది.

ఈ సొరంగం పూర్తయిన తర్వాత లడఖ్ నుండి కాశ్మీర్ మధ్య దూరం 3గంటల 15 నిమిషాలపాటు తగ్గుతుంది. 15 నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకోవచ్చు.

అత్యాధునికంగా నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ లో సీసీటీవీ కెమెరాలు, ఓవర్ హైట్ వాహనాలను గుర్తించడం, ఆటోమెటిక్ ఫైర్ డిటెక్షన్, ఫైర్ అలారం, ఇక స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ నిర్మిస్తున్నారు.