Guava Leaves: దంత సంపదకు జామ అకులే శ్రీరామరక్ష.. రోజూ ఉదయాన్నే ఇలా వాడితే చాలు!

|

Jun 18, 2024 | 1:17 PM

పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? రక్తస్రావం కూడా అవుతుందా? తరచుగా టాయిలెట్‌కి వెళ్లాలా? ఒకే ఒక్క ఆకుతో ఈ సమస్యలన్నింటినీ సహజంగా వదిలించుకోవచ్చు. అదే జామఆకు. అవును జామపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. ఒక పెద్ద జామపండులో ఒక గ్లాసు పాలలో ఉండే పోషకాలు ఉంటాయి. అయితే జామ పండ్లలోనే కాదు జామ ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు..

1 / 5
పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? రక్తస్రావం కూడా అవుతుందా? తరచుగా టాయిలెట్‌కి వెళ్లాలా? ఒకే ఒక్క ఆకుతో ఈ సమస్యలన్నింటినీ సహజంగా వదిలించుకోవచ్చు. అదే జామఆకు. అవును జామపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. ఒక పెద్ద జామపండులో ఒక గ్లాసు పాలలో ఉండే పోషకాలు ఉంటాయి. అయితే జామ పండ్లలోనే కాదు జామ ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

2 / 5
జామ ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా జామ పండ్లతో పాటు జామ ఆకులను కూడా తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఇది అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంది.

3 / 5
జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి డయాబెటిక్ రోగులకు జామ ఆకులు ఎలాంటి బెరుకు లేకుండా తినవచ్చు. ఇందులో విటమిన్-సి కాకుండా, జామ ఆకుల్లో యాంటీ అలర్జీ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పికి జామ ఆకులు చాలా ఉపయోగపడతాయన్నమాట.

4 / 5
జామ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జామ ఆకులు అజీర్ణం, మలబద్ధకం సమస్యలకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది అదనపు శరీర బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

5 / 5
దంతాలు, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నొప్పులు, చిగుళ్లలో రక్తస్రావం, నోటి దుర్వాసన, పైయోరియా వంటి వాటికి చికిత్స చేయడంలో జామ ఆకులు చాలా ఉపయోగపడతాయి. జామ ఆకులను బాగా కడిగి ప్రతిరోజూ ఉదయం తింటే చాలు. పై అన్నీ సమస్యలు పారిపోతాయి. అలాగే జామ ఆకులను టీ లేదా నీటితో ఉడకబెట్టి అయినా తీసుకోవచ్చు. జామ ఆకులు వేసి ఉడకబెట్టిన వేడినీటితో పుక్కిలిస్తే దంతాలు, చిగుళ్ల సమస్యలు దూరం అవుతాయి.