
అల్యూమినియం కుక్కర్ల ప్రయోజనాలు: సాధారణంగా మనకు మార్కెట్‌లో రెండు రకాల కుక్కర్‌లు అందుబాటులో ఉంటాయి. ఒకటి అల్యూమీనియం, మరోకటి స్టెయిన్‌లెస్ స్టీల్.. అల్యూమినియం కుక్కర్‌కు మనకు బడ్జెట్‌లో దొరుకుతాయి. కొత్తగా ఇల్లు పెట్టే వారికి లేదా తక్కువ ఖర్చులో చూసేవారికి ఇది మంచి ఆప్షన్. అలాగే ఇవి బరువు తక్కువగా ఉండటం వల్ల వాడుకోవడం సులభంగా ఉంటాయి. అంతేకాదు ఇవి వేడిని త్వరగా గ్రహించి వంటలు త్వరగా అయ్యేందుకు సహాయపడుతాయి. బిజీగా ఉండే ఉదయపు సమయాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది.

అల్యూమినియం కుక్కర్ల లోపాలు: అల్యూమినయంలో వండిన ఆహారాలు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపులను చెబుతున్నారు. ఎందుకంటే అల్యూమినియం రసాయన చర్య జరిపే గుణాన్ని కలిగి ఉంటుంది. టమాటాలు, చింతపండు, నిమ్మరసం వంటి పులుపు పదార్థాలను ఇందులో వండినప్పుడు.. అల్యూమీనియం కరిగి ఆహారంలో కలిసే ప్రమాదం ఉంటుంది. ఆ ఆహారాన్ని తినడం వల్ల మన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

స్టీల్ కుక్కర్ ప్రయోజనాలు: మీరు మన్నిక ఉండేలాంటి కుక్కర్ కోసం చూస్తుంటే.. స్టెయిన్‌లెస్ స్టీల్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏళ్ల తరబడి వాడినా ఇది ఇంకా కొత్తదానిలానే కనిపిస్తుంది.దీనిపై అల్యూమినియం దానిలా గీతలు అస్సలు పడవు. అలాగే దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా సులభం.అంతేకాదు మీరు దీన్ని ఎంత బలంగా రుద్దినా అరిగిపోతుందనే భయం ఉండదు. గతంలో వీటిలో ఆహారం కాస్త నెమ్మదిగా ఉడికేది.. కానీ ఇప్పుడొచ్చిన కొత్త కుక్కర్లలో వంట యమస్పీడ్‌గా చేయొచ్చు.

రెండింటి మధ్య తేడా ఏమిటి: రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఎలాంటి రసాయన చర్యకు లోనవదు. కాబట్టి మీరు వండే పదార్థాల రుచిలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజువారి వంట కోసం స్టెయిన్‌లెస్ స్టీల్‌ను బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ఏది కొనడం బెస్ట్: మీరు ఏ కుక్కర్ కొనడం బెస్ట్ అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో పని త్వరగా అవ్వాలి అనుకుంటే అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ ఒక ఆచరణాత్మకమైన ఎంపిక. కానీ మీరు ఎక్కువకాలం, ఆరోగ్యం, ఆహార భద్రత కోసం చూస్తుంటే.. స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఏది కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి.