ఏసీ vs కూలర్.. మీ జేబుకు చిల్లు పడకుండా ఇల్లు చల్లబడాలంటే ఏది బెస్ట్..?

Updated on: Jun 22, 2026 | 4:19 PM

కాలంతో సంబంధం లేకుండా చాలా మందికి ఏసీలు, కూలర్లు ఉండాల్సిందే. అయితే మధ్యతరగతి ప్రజల మనసులో మెదిలే అతిపెద్ద ప్రశ్న.. కూలర్ కొంటే మంచిదా? లేక ఏసీ బెటరా? ఈ రెండిటిలో ఏది తక్కువ ఖర్చుతో కూడుకున్నది ? అయితే ఏసీ లేదా కూలర్ కొనేముందు కేవలం దాని ధర మాత్రమే కాదు, భవిష్యత్తులో వచ్చే కరెంట్ బిల్లులను కూడా లెక్కేసుకోవాలి. జేబుకు చిల్లు పడకుండా ఇల్లు చల్లబడాలంటే ఏది బెస్ట్ ఆప్షన్ అనేది తెలుసుకుందాం.

1 / 5
మొదటిగా కొనుగోలు ఖర్చు విషయానికి వస్తే.. ఏసీలతో పోలిస్తే ఎయిర్ కూలర్లు చాలా చౌకగా లభిస్తాయి. మార్కెట్లో ఒక మంచి కూలర్ లేదా డెజర్ట్ కూలర్ ధరలు కేవలం రూ.5000 నుండి ప్రారంభమై రూ.20,000 లోపే దొరుకుతాయి. వీటికి ఎలాంటి అదనపు ఇన్‌స్టాలేషన్ ఖర్చులు కూడా ఉండవు. అదే ఒక మంచి 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కొనాలంటే కనీసం రూ.30,000 నుండి రూ. 60,000 వరకు ఖర్చు పెట్టాలి. దీనికి తోడు ఇన్‌స్టాలేషన్, స్టెబిలైజర్ కోసం మరో రూ.3,000 వరకు అదనపు భారం పడుతుంది.

2 / 5
రెండోది అత్యంత ముఖ్యమైనది విద్యుత్ వినియోగం. ఏసీలు కంప్రెసర్ సహాయంతో పనిచేస్తాయి కాబట్టి పవర్ ఎక్కువగా లాగుతాయి. కానీ కూలర్లు కేవలం వాటర్ ఎవాపరేషన్, ఫ్యాన్ సహాయంతో నడుస్తాయి. ఒక సాధారణ కూలర్ గంటకు కేవలం 150 నుండి 300 వాట్ల కరెంట్ మాత్రమే వాడుకుంటుంది. దీనివల్ల నెలంతా వాడినా బిల్లు రూ.500 లోపే వస్తుంది. అదే ఏసీ విషయానికి వస్తే, గంటకు 1200 నుండి 2,000 వాట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది. రోజుకు 8 గంటల చొప్పున రన్ చేస్తే, నెలవారీ కరెంట్ బిల్లు రూ. 2,000 నుండి రూ. 4,000 దాటే అవకాశం ఉంది.

3 / 5
మూడోది మెయింటెనెన్స్ ఖర్చులు. ఎయిర్ కూలర్లకు ఏటా పెద్దగా ఖర్చు ఉండదు. కేవలం కూలింగ్ ప్యాడ్స్ మార్చడానికి లేదా క్లీన్ చేయడానికి కొన్ని వందల రూపాయలు సరిపోతాయి. ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా మనమే వీటిని సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఏసీలకు ప్రతి సంవత్సరం కచ్చితంగా ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించాల్సిందే. గ్యాస్ లీకేజీలు, ఫిల్టర్ క్లీనింగ్, ఇతర రిపేర్ల కోసం ఏటా రూ.1,500 నుండి రూ. 3,000 వరకు జేబులోంచి తీయక తప్పదు.

4 / 5
ధర, బిల్లులతో పాటు మీరుండే ప్రాంత వాతావరణం కూడా ఇక్కడ చాలా కీలకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేసవిలో గాలిలో తేమ తక్కువగా ఉండి పొడి ఎండలు  ఉంటాయి. ఇలాంటి చోట్ల ఎయిర్ కూలర్లు గాలి ఉష్ణోగ్రతను 5 నుండి 10 డిగ్రీల వరకు తగ్గించి అద్భుతంగా పనిచేస్తాయి. అదే వైజాగ్, చెన్నై లాంటి తీరప్రాంతాల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూలర్ వేస్తే ఉక్కపోత మరింత పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలకు గదిలోని తేమను లాగేసే ఏసీ మాత్రమే కరెక్ట్ ఛాయిస్.

5 / 5
చివరగా తేల్చేది ఏంటంటే.. మీకు బడ్జెట్ తక్కువగా ఉండి, కరెంట్ బిల్లు భారం పడకూడదు అనుకుంటే ఎయిర్ కూలర్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఒకవేళ ఖర్చుతో సంబంధం లేదు.. ఎంత ఉక్కపోత ఉన్నా సరే గది కూల్‌గా మారిపోవాలి, రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర కావాలనుకుంటే ఏసీ పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఒకవేళ ఏసీ వాడినా కరెంట్ బిల్లు తగ్గాలనుకుంటే టెంపరేచర్‌ను 24 లేదా 26 డిగ్రీలపై సెట్ చేసి సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయడం మంచి మార్గం.

Follow Us