
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2026 ఏడాది రాబోయే రెండవ సూర్యగ్రహణానికి సంబంధించిన కొని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ గ్రహణం మనకి కనిపించదు కాబట్టి, ఇక్కడ ఎలాంటి నియమాలను పాటించే పని లేదు. ఇంకా దేవాలయాలు కూడా మూతపడవు. కొన్ని చోట్ల మాత్రం మూతపడే అవకాశం ఉంది.

2026 లో రెండో సూర్య గ్రహణం ఎప్పుడంటే? ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీన సంభవించనుంది. మన కాలమానం ప్రకారం, ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి 09:12 నిమిషాలకు మొదలయ్యి, అర్ధరాత్రి దాటిన తర్వాత ఆగస్టు 13వ తేదీ తెల్లవారుజామున గం. 01:23 నిమిషాల వరకు ఉండనుంది.

వృషభ రాశి : గ్రహణం తరవాత నుంచి వీరి జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి. ఆర్థికంగా లాభ పడతారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. ఇంకా డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుకుతారు. అంతక ముందు ఉన్న భూములకు రేట్లు పెరుగుతాయి మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టిన దగ్గర లాభాలు వస్తాయి. ఇంకా అనుకున్న పనులు అవ్వడంతో సంతోషంతో ఎగిరి గంతేస్తారు

మిథున రాశి : గ్రహణం తరవాత నుంచి వీరి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఏది పట్టుకుంటే అది వీరి సొంతమవుతుంది ఇంకా వీరికి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టిన వారు అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు. కోర్టు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంకా కొత్త పరిచయల వలన మొత్తం మారుతుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)