తాజ్‌మహల్ పక్కనే రాజభవనం..దేశంలోనే అత్యంత ఖరీదైన హోటళ్లలో ఒకటి..?ప్రత్యేకతలివే!

Updated on: Nov 25, 2026 | 4:59 PM

భారతదేశంలో విలాసవంతమైన పర్యటనలకు, రాజసాన్ని తలపించే ఆతిథ్యానికి పేరుగాంచిన హోటళ్లలో ఆగ్రాలోని ది ఒబెరాయ్ అమర్‌విలాస్ ఒకటి. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌కు కేవలం సుమారు 600 మీటర్ల దూరంలో ఉన్న ఈ హోటల్, తన ప్రత్యేక స్థానం, నిర్మాణ వైభవంతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

1 / 5
నిర్మాణ శైలి, ప్రత్యేకతలు:మొఘల్ కాలపు రాజభవనాల వాస్తుశైలిని ప్రతిబింబించేలా ఈ హోటల్‌ను తీర్చిదిద్దారు. ప్రవేశద్వారం వద్ద చార్‌బాగ్ తరహా తోటలు, ఫౌంటెన్లు, కొలనులు, పాలరాయి, ఇసుకరాయి నిర్మాణాలు అతిథులకు చారిత్రక వైభవాన్ని కళ్లముందు ఉంచుతాయి. ఈ హోటల్‌లోని అనేక గదులు, ప్రదేశాల నుంచి తాజ్‌మహల్ దృశ్యాలు స్పష్టంగా కనిపించడం దీని ప్రధాన ప్రత్యేకత.

2 / 5
గదులు, ఖరీదైన కోహినూర్ సూట్: ఇక్కడ ప్రీమియర్ రూమ్స్, డీలక్స్ సూట్స్, లగ్జరీ సూట్స్‌తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన కోహినూర్ సూట్ అందుబాటులో ఉన్నాయి.

3 / 5
సుమారు 230 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే కోహినూర్ సూట్‌లో లివింగ్, డైనింగ్ ఏరియాలు, ప్రైవేట్ బాల్కనీలు ఉంటాయి. బంగారు గుమ్మటపు పైకప్పులు, పాలరాయి అలంకరణలు, 24 గంటల బట్లర్ సేవలు వంటి సదుపాయాలు అతిథులకు అందుబాటులో ఉంటాయి.

4 / 5
సీజన్, గది రకాన్ని బట్టి అద్దెలు మారుతుండగా, కోహినూర్ సూట్ ఒక రాత్రి బసకే దాదాపు 14,500 డాలర్ల (రూపాయల విలువలో పది లక్షలకు పైగా) స్థాయిలో ఖరీదైనదిగా నిలుస్తుంది.

5 / 5
భోజన సదుపాయాలు, గుర్తింపు:హోటల్‌లోని బెల్లెవ్యూ, ఎస్ఫహాన్ వంటి రెస్టారెంట్లలో భారతీయ, అంతర్జాతీయ రుచులను అందిస్తారు. ప్రైవేట్ బాల్కనీలో తాజ్‌మహల్ నీడలో క్యాండిల్‌లైట్ డిన్నర్ వంటి ప్రత్యేక అనుభూతులను కూడా అందిస్తారు. అంతర్జాతీయ ట్రావెల్ అవార్డులు, గుర్తింపులు పొందిన ఈ హోటల్, దేశవిదేశాల ప్రముఖులు, సెలబ్రిటీలకు ఆగ్రాలో తొలి ఎంపికలలో ఒకటిగా కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us