
90ల గొడ్డు కారం అన్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎందుకంటే దీనిని ఇంట్లో ఉండే వాటితోనే కేవలం 07 నిమిషాల్లోనే చేసుకుని తినొచ్చు. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

90ల గొడ్డు కారం అన్నానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అన్నం, 10 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, రెండు టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్, తాలింపుకు పోపు దినుసులు అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ శనగపప్పు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, చిటికెడు పసుపును తీసుకోవాలి.

గొడ్డు కారం అన్నం తయారీ విధానం : ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఆవాలు, పోపు దినుసులు, నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేయించాలి. ఆ తరవాత దీనిలో దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పచ్చి వాసన పోయే వరకువీటిని బాగా వేయించాలి.

గొడ్డు కారం అన్నం తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మీడియం మంటపై దీనిని ఉంచి కలపాలి. ఇదంతా అయిపోయాక దీనిలో ముందుగా ఉడికించి అన్నం కూడా వేసి దీనిలో కలపాలి. ఇంకా దీనిని మంటపై 3 నిమిషాలు ఉంచి కిందకు దించేయాలి.

పాత రోజుల్లో జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గొడ్డు కారం అన్నాన్నే తినేవాళ్లు. దీనిలో ఉండే ఘాటు జ్వరాన్ని తగ్గించేవి. మీరు కూడా మీ ఇంట్లో దీనిని ట్రై చేసి తినండి. జలుబు, దగ్గు ఉన్నా కూడా తగ్గిపోతోంది. ఇతర సమస్యలతో బాధ పడేవాళ్లు వైద్య నిపుణులను సంప్రదించి తినడం మంచిది