దానిమ్మ తొక్కలను చెత్తలో పడేస్తున్నారా..? ఆగండాగండి.. ఈ నిజాలు తెలిస్తే ఇంకోసారి ఆ తప్పు చెయ్యరు..

Updated on: Apr 08, 2026 | 11:31 AM

ఆయుర్వేదం ప్రకారం ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు ఒక ఔషధమే. ఈ క్రమంలో దానిమ్మ పండును పోషకాల గని అని పిలుస్తాం. కానీ పండు కంటే దాని తొక్కలోనే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. మొటిమలు, జుట్టు రాలడం, ఉదర సంబంధిత వ్యాధులకు ఒక అద్భుతమైన ఇంటి చిట్కాగా దానిమ్మ తొక్క ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

1 / 5
సాధారణంగా మనం దానిమ్మ పండును తిని, దాని తొక్కలను వేస్ట్ అని భావించి చెత్తబుట్టలో పారేస్తుంటాం. కానీ ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార నిపుణుల ప్రకారం.. పండు కంటే దానిమ్మ తొక్కలోనే అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో ఉండే ఫినోలిక్ ఆమ్లం, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి.

2 / 5
మెరిసే చర్మం కోసం సహజమైన ఫేస్ ప్యాక్: ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు లేదా గుల్లలతో బాధపడేవారికి దానిమ్మ తొక్క ఒక వరప్రసాదం. ఎండిన దానిమ్మ తొక్కల పొడిని కొద్దిగా గులాబీ నీటితో కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ముఖానికి రాసుకుంటే, చర్మంపై ఉండే బ్యాక్టీరియా నశించి, చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది రసాయనాలు లేని సహజమైన సౌందర్య సాధనం.

3 / 5
కడుపు సమస్యలకు చెక్: వేసవి కాలంలో వేధించే విరేచనాలు లేదా రక్తవిరేచనాల వంటి సమస్యలకు దానిమ్మ తొక్క పొడి అద్భుతంగా పనిచేస్తుంది. గ్లాసు మజ్జిగలో దానిమ్మ తొక్కల పొడిని, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడిని కలిపి తాగాలి. ఇది కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను చంపి, పేగుల వాపును తగ్గిస్తుంది. జీర్ణక్రియను సమతుల్యం చేయడంలో ఇది కీలకంగా మారుతుంది.

4 / 5
జుట్టు రాలడం - చుండ్రుకు పరిష్కారం: దానిమ్మ తొక్కలు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. వీటిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా చుండ్రు సమస్య నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

5 / 5
మొలల సమస్యకు ఆయుర్వేద విరుగుడు: మలబద్ధకం, మొలల సమస్యతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు దానిమ్మ పొడిని మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Follow Us