
పాత్రలపైమూత పెట్టడం: వంట చేసేటప్పుడు లేదా నీటిని మరిగించేటప్పుడు పాత్రపై ఎప్పుడూ మూత పెట్టాలి. మూత లేకుండా వండితే ఆవిరితో పాటు వేడి కూడా బయటకు పోతుంది. దీనివల్ల వంట అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల త్వరగా అయిపోతుంది. అలాగే చాలా మంది గిన్నెలు కడిగిన వెంటనే తడిగా ఉన్నప్పుడే స్టవ్‌పై పెట్టేస్తారు. ఆ పాత్రపై ఉన్న నీరు ఆరడానికే మొదట్లో 1 నుండి 2 నిమిషాల గ్యాస్ వృథా అవుతుంది. కాబట్టి పాత్రను పొడి గుడ్డతో తుడిచిన తర్వాతే స్టవ్‌పై పెట్టండి.

ఫ్రిజ్‌లోని వస్తువులను నేరుగా వేడి చేయడం: పాలు, కూరగాయలు లేదా పిండిని వంటి వాటిని చాలా మంది ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే వేడి చేస్తారు. తద్వారా గ్యాస్ ఎక్కవ ఖర్చు అవుతుంది. ఎందుకంటే చల్లని వస్తువు వేడి కావడానిక టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు ప్రిజ్‌లో ఉన్న వాటితో వంటచేయాలి అనుకుంటే.. వాటిని బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన తర్వాత వండండి. ఇలా చేస్తే గ్యాస్ వృథా కాకుండా ఉంటుంది. అలాగే వంటచేస్సుడు మంటను మీడియం ప్లేమ్‌లో ఉంచండి, ఎక్కవ మంట పెట్టడం ద్వారా అది సగం గాల్లో కలిసి వృథా అయ్యే అవకాశ ఉంటుంది.

అవసరమైనంత నీరు: పప్పు, అన్నం లేదా కూరగాయలు వండేటప్పుడు అవసరానికి మించి ఎక్కువ నీరు పోయకండి. ఎక్కువ నీటిని మరిగించడానికి గ్యాస్ ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచాల్సి వస్తుంది. దీనివల్ల గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా, ఆహారంలోని పోషకాలు కూడా నశిస్తాయి. అలాగే పప్పులు, అన్నం, బంగాళాదుంపలు లేదా గట్టి కూరగాయలను విడిగా వండటానికి బదులు ప్రెజర్ కుక్కర్‌లో వండండి. కుక్కర్‌లో ఆవిరి ఒత్తిడి కారణంగా ఆహారం 3 రెట్లు వేగంగా ఉడుకుతుంది. తద్వారా గ్యాస్ సేవ్ అవుతుంది

బర్నర్ క్లీనింగ్: మీ గ్యాస్ మంట పసుపు లేదా ఎరుపు రంగులో వస్తుంటే, బర్నర్ రంధ్రాలలో చెత్త ఉందని అర్థం. అలా ఉంటే గ్యాస్ సరిగ్గా మండకా వృథా అవుతుంది. కాబట్టి బర్నర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. అలాగే పూరీలు, బజ్జీలు వేయించేటప్పుడు మరీ పెద్ద కడాయిని వాడకండి. పెద్ద కడాయిలోని నూనె వేడెక్కడానికి, ఆ వేడిని అలాగే ఉంచడానికి ఎక్కువ గ్యాస్ అవసరం అవుతుంది. అందుకోసం చిన్న, లోతుగా ఉండే కడాయిని ఉపయోగించడం మంచిది.

ముందే ప్రిపరేషన్ చేసుకోండి: వంట చేయడం ప్రారంభించే ముందే కూరగాయలు కోయడం, మసాలాలు సిద్ధం చేసుకోవడం వంటి పనులన్నీ పూర్తి చేసుకోండి. స్టవ్ వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం లాంటివి చేస్తే, ఈ లోపు గ్యాస్ వృథాగా కాలిపోతుంది. అలాగే పప్పులు, బియ్యం లేదా శనగలు వంటి వాటిని వండటానికి కనీసం అర గంట లేదా గంట ముందే నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. అలాగే గ్యాస్ వినియోగం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీరు గ్యాస్‌తో పాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు.