
కిటికీలు తెరిచే సమయంలో జాగ్రత్త: వేసవిలో ఇంటికి చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.. కానీ ఈ విషయం కొందరు చేసే తప్పుల కారణంగా ఇంటి వాతావరణం వేడిగా మారుతుంది. అవును బయట గాలి వల్ల ఇంట్లో చల్లదనం ఏర్పడుతుందని చాలా మంది రోజుమొత్తం కిటికీలు తెరిచి ఉంచుతారు. కానీ, దీనివల్ల బయట ఉండే వేడి గాలి లోపలికి ప్రవేశిస్తుంది. ఉదయం 8 గంటల లోపు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే కిటికీలు తెరవాలి. మధ్యాహ్న సమయంలో కిటికీలు మూసివేసి, మందపాటి తెరలు వేయడం వల్ల నేరుగా ఎండ లోపలికి రాకుండా ఉంటుంది. ఇది వల్ల ఇళ్లు చల్లగా ఉంటుంది.

ఇండోర్ ప్లాంట్స్ : మొక్కలు ఎక్కడుంటే అక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది. అందుకే ఇంట్లో కొన్ని చిన్న మొక్కలను పెంచుకోవడం ఉత్తమం. స్నేక్ ప్లాంట్, అలోవెరా , మనీ ప్లాంట్ లేదా అరెకా పామ్ వంటి మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఈ మొక్కలు గాలిని సహజంగా శుద్ధి చేయడమే కాకుండా, పరిసరాల్లోని వేడిని గ్రహించి వాతావరణాన్ని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచుతాయి. దీని వల్ల మీ ఇళ్లు కూలర్ లేకుండానే చల్లగా మారుతుతంది.

ఎలక్ట్రాకిన్ వాడకం తగ్గించండి: ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల కారనంగా కూడా వేడి వాతావరణం ఏర్పడుతుంది. ఇది చాలా మందికి తెలియదు. ఇంట్లో టీవీలు, కంప్యూటర్లు, పాత బల్బులు రన్ అవుతున్నప్పుడు వేడిని విడుదల చేస్తాయి. కాబట్టి వీటిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి. లేదంటే ఆఫ్‌లో ఉంచండి. పాత ఫిలమెంట్ బల్బులకు బదులుగా LED బల్బులను వాడండి, ఎందుకంటే ఇవి తక్కువ వేడిని విడుదల చేస్తాయి. వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏర్పాటు చేసుకోండి. ఇది వంట చేసేటప్పుడు వచ్చే వేడి గాలి బయటకు పంపి ఇంట్లో చల్లటి వాతావరణాన్ని పెంచుతుంది.

పైకప్పు మీద వైట్ పెయింట్ : చాలా మంది ఇంటి పైకప్పు చెత్త కారణంగా నల్లగా మారి ఉంటుంది. నలుపు రంగు ఎండను ఎక్కువగా గ్రహిస్తుంది. ఇంటి పైకప్పు వేడెక్కడం వల్ల లోపల గదులు సెగలా ఉంటాయి. కాబట్టి పైకప్పు మీద తెలుపు రంగు సున్నం లేదా హీట్ రిఫ్లెక్టింగ్ పెయింట్ వేయడం వల్ల సూర్యకిరణాలు పరావర్తనం చెందుతాయి. దీనివల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రలు చాలా వరక తగ్గుతాయి.

లేత రంగు తెరలు: చాలా మంది ఇంటి డోర్స్‌కు రంగురంగుల కర్టెన్స్ వేస్తారు. కానీ ముదురు రంగు కర్టెన్స్ వేడిని త్వరగా పీల్చుకుంటాయి. కాబట్టి కిటికీలకు, తలుపులకు ఎల్లప్పుడు లేత రంగు కర్లెన్స్ మాత్రమే వాడండి. ఇవి ఎండను వెనక్కి నెట్టి, గదిని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు కిటికీ దగ్గర తడి తువ్వాలు లేదా తడి కర్లెన్స్‌ను కడితే, బయట నుండి వచ్చే గాలి ఆ తేమను తగిలి గదిలోకి చల్లగా వస్తుంది. సమ్మర్ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే, ఏసీ, కూలర్ లేకుండానే మీ ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.