విమానంలో టీ, కాఫీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఈ నిజాలు తెలిస్తే మైండ్ బ్లాంకే..

Updated on: Jul 17, 2026 | 5:54 PM

విమాన ప్రయాణంలో అలసట పోవడానికి వేడివేడిగా టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.. పైకి ఎంతో రిఫ్రెషింగ్‌గా అనిపించే ఈ అలవాటు.. విమానంలో ప్రయాణించేటప్పుడు మాత్రం మీ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేల మీద టీ, కాఫీలు తాగడానికి.. వేల అడుగుల ఎత్తులో విమానంలో తాగడానికి శరీరం స్పందించే తీరులో చాలా తేడా ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
గ్యాస్, కడుపులో మంట: విమానంలో గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇలాంటి సమయంలో ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీలు తాగితే ఎసిడిటీ, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. కెఫీన్‌కు సున్నితంగా స్పందించే వారు విమానంలో కాఫీ తాగడం వల్ల ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరగడం, ఆందోళన లేదా కంగారుగా అనిపించడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

2 / 5
బీపీ పెరగడం: ఎక్కువ మొత్తంలో కెఫీన్ తీసుకోవడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ముందే హైబీపీ సమస్య ఉన్న ప్రయాణికులు విమానంలో టీ, కాఫీలకు దూరంగా ఉండటమే మంచిది. అంతేకాకుండా సుదీర్ఘ ప్రయాణాల్లో శరీరం కాస్త విశ్రాంతి కోరుకుంటుంది. కానీ కాఫీలోని కెఫీన్ మీ నిద్రకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల జెట్ లాగ్ సమస్య పెరిగి, గమ్యస్థానం చేరుకున్నాక కూడా తీవ్ర అలసట, అశాంతి వేధిస్తాయి.

3 / 5
బాడీలో నీటి కొరత: విమాన క్యాబిన్‌లలో ఉండే గాలి సాధారణంగా చాలా పొడిగా ఉంటుంది. దీనివల్ల ప్రయాణంలో మన శరీరం సహజంగానే డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనికి తోడు టీ, కాఫీలలో ఉండే కెఫీన్ వల్ల మూత్రవిసర్జన ఎక్కువగా జరిగి, శరీరంలో నీటి కొరత మరింత తీవ్రమవుతుంది. కాబట్టి మన శరీరం హైడ్రేట్‌గా ఉండాలంటే వాటిని తీసుకోకపోవడమే మంచిది.

4 / 5
ఈ జాగ్రత్తలు తీసుకోండి: ఒక కప్పు టీ లేదా కాఫీ తాగితే, దానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా మంచి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఫ్లైట్ ఎక్కే ముందు లేదా ఫ్లైట్‌లో ఖాళీ కడుపుతో కెఫీన్ పానీయాలు అస్సలు తీసుకోకండి. ప్రయాణంలో నిద్రపోవడానికి కనీసం కొన్ని గంటల ముందు నుంచే కాఫీ తాగడం పూర్తిగా మానేయండి. గర్భిణీలు, చిన్న పిల్లలు, గుండె, బీపీ సమస్యలు ఉన్నవారు విమానంలో టీ, కాఫీలు తీసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ సలహా పాటించాలి.

5 / 5
సేఫ్ జర్నీ కోసం సింపుల్ టిప్స్: విమాన ప్రయాణంలో అలసట లేకుండా, యాక్టివ్‌గా ఉండాలంటే టీ, కాఫీలకు బదులు పుష్కలంగా మంచి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోండి. తేలికపాటి పోషకాహారాన్ని మాత్రమే భుజించండి. గంటల తరబడి ఒకే సీటుకు పరిమితం కాకుండా మధ్యమధ్యలో కొద్దిసేపు అటు ఇటు నడుస్తూ శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. మద్యం, సాఫ్ట్ డ్రింక్స్, అధిక కెఫీన్ పానీయాలకు ఎంత దూరంగా ఉంటే మీ ప్రయాణం అంత సుఖవంతంగా సాగుతుంది.

Follow Us