మేకప్ అవసరమే లేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో మిళమిళ మెరిసిపోవడం పక్కా..

Updated on: Jul 17, 2026 | 6:32 PM

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో గంటల తరబడి మేకప్ వేసుకోవడం సమయం వృధా చేయడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఏమాత్రం మంచిది కాదు. అందుకే ప్రస్తుత రోజుల్లో చర్మాన్ని మేకప్‌తో కప్పి ఉంచడం కంటే దాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుకునే నో మేకప్ లుక్ అనే సరికొత్త ట్రెండ్ విపరీతమైన వైరల్ అవుతుంది. కేవలం 5 నిమిషాల్లో మీ ముఖం మిళమిళ మెరిసిపోవాలంటే ఇలా చేయండి..

1 / 5
చర్మ నిపుణుల ప్రకారం.. ముఖంపై సహజమైన మెరుపు రావాలంటే చర్మానికి తగినంత తేమను అందించడం, ముఖంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం చాలా ముఖ్యం. మీరు ఎలాంటి మేకప్ ధరించారో ఇతరులకు తెలియకుండానే మీ సహజ అందాన్ని మెచ్చుకోవాలనే కోరిక ఉంటే, అందుకు చర్మ సంరక్షణే అత్యంత ప్రభావవంతమైన మార్గం. దీనికోసం ముందుగా ముఖాన్ని ఒక తేలికపాటి క్లెన్సర్‌తో శుభ్రంగా కడుక్కోవడంతోనే అసలైన చర్మ సంరక్షణ మాయాజాలం మొదలవుతుంది.

2 / 5
ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత విటమిన్ సి లేదా హయలురోనిక్ యాసిడ్ కలిగిన గ్లో సీరమ్‌ను రాసి, ఆపై మంచి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. దీనితో పాటు చర్మ సంరక్షణలో సన్‌స్క్రీన్ వాడకం తప్పనిసరి. ఎందుకంటే ఇది సూర్యరశ్మి నుండి రక్షణ ఇవ్వడమే కాకుండా ముఖానికి ఒక ప్రత్యేకమైన మెరుపును అందిస్తుంది. దీనివల్ల ఎలాంటి కృత్రిమ హైలైటర్లు ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.

3 / 5
ముఖ సౌందర్యంలో కనుబొమ్మలు, కళ్లు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి వాటిని సరైన ఆకృతిలో ఉంచుకోవడం అవసరం. కనుబొమ్మలు నిండుగా కనిపించేందుకు స్పూలీ బ్రష్‌తో వాటిని పైకి దువ్వుకోవాలి, అలాగే ఐలాష్ కర్లర్‌తో కనురెప్పల వెంట్రుకలను వంచడం ద్వారా కళ్ళు తక్షణమే పెద్దవిగా కనిపిస్తాయి. ఒకవేళ కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే.. కొద్దిగా కన్సీలర్‌ను అద్దాలి తప్ప ముఖంపై రుద్దకూడదు, అప్పుడే లుక్ సహజంగా ఉంటుంది.

4 / 5
ఇక బుగ్గలకు గులాబీ రంగు సొగసును తీసుకురావడానికి బీట్‌రూట్ టింట్‌ను అప్లై చేయవచ్చు లేదా వేళ్లతో బుగ్గలను తేలికగా తట్టడం ద్వారా రక్త ప్రసరణను పెంచవచ్చు. పెదవుల విషయానికొస్తే, దట్టమైన లిప్‌స్టిక్‌లకు దూరంగా ఉంటూ తేమను, తేలికపాటి మెరుపును ఇచ్చే టింటెడ్ లిప్ బామ్ లేదా లిప్ ఆయిల్‌ను ఎంచుకోవడం ఉత్తమం. చివరగా ముఖంపై ఫేస్ మిస్ట్‌ను స్ప్రే చేయడం వల్ల చర్మం రోజంతా మృదువుగా, తాజాగా ఉంటుంది.

5 / 5
ప్రస్తుతం సహజంగా కనిపించడానికే ప్రపంచం ప్రాధాన్యత ఇస్తుంది. ఈ 5 నిమిషాల సౌందర్య దినచర్యతో పాటు సరైన ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర తోడైతే అంతర్గత సంతోషం ముఖంపై దానంతట అదే ప్రతిబింబిస్తుంది. మేకప్ అనేది కేవలం ఒక ఎంపిక మాత్రమేనని, మీ ఆత్మవిశ్వాసంతో కూడిన సహజ సౌందర్యమే మీ అసలైన గుర్తింపు అని గుర్తుంచుకోవాలి.

Follow Us